English   

నయనతార కూతురిగా కీర్తి సురేష్

Keerthy Suresh
2020-08-05 10:54:13

అరవై ఏళ్ళు పైబడిన వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ రజనీ గట్టిగా పోటీ ఇస్తున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం విశ్వాసం ఫేమ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో అన్నాత్తే పేరుతో వస్తోన్న ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లానే కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే షూటింగ్స్ కి పర్మిశంస్ ఇచ్చిన నేపధ్యంలో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుందట యూనిట్. అయితే వయసు రీత్యా రజినీ ఇప్పట్లో షూట్ లో పాల్గొనడట. కరోనా ప్రభావం తగ్గేవరకూ శివ రజనీ లేని సీన్స్ షూట్ చేయనున్నాడని అంటున్నారు. కుష్బూ, మీనా, కీర్తి సురేష్, నయనతారలు నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన లైన్ ఇదే నంటూ ఒక కధ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఆ ప్రచారాన్ని బట్టి ఈ సినిమాలో రజనీకాంత్ కి కుష్బూ, మీనాలు మరదళ్ళుగా నటిస్తున్నారు. ఆయనను పెళ్లి చేసుకోడానికి ఇద్దరూ పోటీ పడుతుంటారట. అయితే ఒకరిని చేసుకుని మరొకరిని నొప్పించడం ఇష్టం లేని రజనీ వీరిద్దరినీ కాదని నయనతారను చేసుకుంటాడట. అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ కాగా వారికి కీర్తి సురేష్ కూతురిగా పుడుతుందట. అంటే నయనతార రజనీకాంత్ ల కూతురిగా కీర్తి నటించనుందన్న మాట.

కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుపుకుంది. హైదరాబాద్ షెడ్యూల్ తరువాత ఈ సినిమా కోల్ కతా, పూణేలో షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ షెడ్యూల్ ను మారుస్తున్నట్టు అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు చెన్నైలోనే షూట్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది అందెవేసిన చేయి, మరి ఈ సినిమాలో రజనీని ఎంతలా ఎలివేట్ చేస్తాడో చూడాలి మరి.  

More Related Stories