English   

కీర్తి సురేష్ సింగర్ అవతారం

keerthy suresh
2018-07-24 17:45:46

మహానటితో మహానటి రేంజ్ అప్లాజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు కంటిన్యూస్ గా కమర్షియల్ సినిమాలే చేస్తోంది. ఇప్పటికే తన చేతిలో ఐదారు సినిమాల వరకూ ఉన్నాయి. వీటిలో తమిళ్ లోనే ఎక్కువ సినిమాలుండటం విశేషం. అయితే ఇవన్నీ మహానటికి ముందు ఒప్పుకున్నవే. అందుకే ముందు వాటిని కంప్లీట్ చేసి ఆతర్వాత కొత్త ప్రాజెక్ట్స్ పై దృష్టిపెట్టబోతోంది. ఇక తమిళ్ లో విక్రమ్ సరసన ‘సామిస్క్వేర్’అనే సినిమా చేస్తోందీ బ్యూటీ. నిన్న ఈ మూవీ ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగానే అందరికీ ఓ కొత్త విషయం తెలిసింది. 

సామి స్క్వేర్ లో కీర్తి సురేష్ ఓ పాట కూడా పాడింది. అవును కీర్తి సురేష్ సింగర్ గా మారింది. మామూలుగా మళయాలీ కుట్టి అయిన ఈ భామ ఏ భాషలో చేసినా ఆ భాష చాలా త్వరగా నేర్చుకుంటోంది. అందుకే మాటల్లోనే కాదు.. ఏకంగా పాటల వరకూ వచ్చేసింది. తెలుగులో అజ్ఞాతవాసిలో తనే డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత మహానటికీ కంటిన్యూ చేసింది. ఇక ఇప్పుడు తమిళ్ లో ఏకంగా పాట కూడా పాడేసింది. ఈ పాటలను విక్రమ్ తో కలిసి పాడటం మరో విశేషం. విక్రమ్ సింగర్ అని గతంలోనే తెలుసు. తనిచ్చిన ధైర్యంతోనే అమ్మడు మైక్ పట్టుకున్నానని చెబుతోంది. 

ఇక పదిహేనేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ సామికి సీక్వెల్ గా వస్తోంది ఈ సామి స్క్వేర్. అప్పటి దర్శకుడు హరినే ఈ మూవీకీ దర్శకుడు. థమన్ సంగీతం అందించిన ఈసినిమాలో కీర్తి, విక్రమ్ లు పాడిన సాంగ్ ఖచ్చితంగా ఈ మూవీకి స్పెషల్ క్రేజ్ తెస్తుందనుకోవచ్చు. 

More Related Stories