English   

గుడ్ లక్ సఖి రిలీజ్ డేట్ ఫిక్స్

Keerthy Suresh
2021-03-01 14:28:52

మహానటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ కీర్తి సురేష్. ఈ సినిమాతో కీర్తి జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తరవాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం ఈ భామ లీడ్ రోల్ చేస్తున్న మరో సినిమా "గుడ్ లక్ సఖి". ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైలర్ ను ఇండిపెండెన్స్ డే సంధర్బంగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లో కీర్తి పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తుండగా...జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ కూడా చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇదిలా వుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 3 వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మహానటి సినిమా తరువాత కీర్తి సరైన హిట్ లేక సతమతవుతోంది. మరి ఈ సినిమా అయినా మహానటికి కలిసొస్తుందా లేదా చూడాలి.

More Related Stories