English   

 నాని, కీర్తిని మళ్లీరావా అంటున్నాడు.. 

keerthy-suresh

మహానటితో మహానటి అనిపించుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ ఎక్కడికో పోతుందనుకున్నారు. కానీ అలా పోతే తనిక ఇలాంటి బయోపిక్స్ కే బలి అవ్వడం ఖాయం అనుకుందేమో.. అందుకే తెలివిగా అడుగులు వేస్తోంది. మహానటి తర్వాత మళ్లీ రెగ్యులర్ మూవీస్ తోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో అమ్మడు మరోసారి మన నేచురల్ స్టార్ తో రొమాన్స్ కు రెడీ అవుతోంది. 

నేచురల్ స్టార్ గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న నాని.. కీర్తి సురేష్ కాంబోలో వచ్చిన నేను లోకల్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఇద్దరూ టాలెంటెడ్ కాబట్టి అన్ని సీన్స్ అదిరిపోయాయి. ఇక అలాంటి క్రేజీ కపుల్ మళ్లీ ఓ సినిమాలో నటించబోతోన్నారనే వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. కీర్తిని తీసుకోవాలని దర్శకుడుతో పాటు నాని కూడా అనుకున్నాడట. అందుకే కీర్తి ఈ ప్రాజెక్ట్ లోకి రావడం ఖాయం అంటున్నారు. 

నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ గానూ ఇరగదీస్తున్నాడు. నాగ్ సినిమా తర్వాత మళ్లీ రావా వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అందించిన గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. దీనికి ఆల్రెడీ జెర్సీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పాతికేళ్ల క్రితం కథగా రాబోతోన్న ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకూ మంచి స్కోప్ ఉంటుందని టాక్. అందుకే కీర్తి వంటి టాలెంటెడ్ బ్యూటీ అయితే బావుంటుందని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. దానికి నాని ఓటేశాడు. పైగా ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఉంటోంది. అందుకే కీర్తి కూడా నో చెప్పే చాన్సెస్ తక్కువే. ఏదేమైనా నేను లోకల్ కపుల్ మళ్లీరావా దర్శకుడితో కలిసి మళ్లీ రిపీట్ అవుతుందేమో చూడాలి. 

More Related Stories