English   

చిరంజీవి KFC చికెన్.. మనవరాళ్ల కోసం వండి పెట్టిన మెగాస్టార్.. 

 Chiranjeevi
2020-11-03 09:36:25

మెగాస్టార్ చిరంజీవి ఎంత అద్భుతమైన నటుడో.. అంతే మంచి వంటగాడు కూడా. ఆయన వంట చేస్తే అబ్బో అంటూ లొట్టలేయాల్సిందే. చిరు పేరు మీద ఏకంగా దోశ ఒకటి స్టార్ హోటల్లో అమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు కూడా మరోసారి తన పాకశాస్త్ర నిపుణత చూపించుకున్నాడు మెగాస్టార్. లాక్‌డౌన్‌కు ముందు వరస సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. కుటుంబంతో పాటు టైమ్ గడుపుడుతున్నాడు. ముఖ్యంగా తన మనవరాళ్లతోనే కావాల్సినంత టైమ్ ఉంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తనకు వచ్చిన వంటలను అభిమానులతో కూడా పంచుకుంటున్నాడు అన్నయ్య. ఆ మధ్య అమ్మ అంజనా దేవి కోసం పెసరెట్లు వేసిన పెట్టిన చిరు.. ఇప్పుడు తన మనవరాళ్ల కోసం కెఎఫ్‌సీ చికెన్ ఇంట్లోనే చేసి పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆదివారం కదా.. బోర్ కొడుతుంది ఏం చేద్దాం అంటూ వీడియో మొదలు పెట్టాడు చిరు.

ఈ వంటలో తనకు అసిస్టెంట్స్ గా పెద్ద కూతురు సుష్మిత కూతురును.. అలాగే చిన్న కూతురు శ్రీజ పెద్ద కూతురును పెట్టుకున్నాడు చిరు. ఈ ఇద్దరూ పిల్లలు దగ్గరుండి మరీ తాతతో కెఎఫ్‌సీ చేయించారు. ఆదివారం బయటి నుంచి కెఎఫ్‌సి తెప్పించుకుందామని సుష్మిత కూతురు అడిగితే.. కోవిడ్ టైమ్‌లో బయటి నుంచి వద్దంటాడు చిరంజీవి. ఇంట్లోనే చేసుకుందాం అంటూ వంట మొదలు పెట్టారు. ఈ చికెన్ కోసం ఏమేం కావాలి.. ఎలా సిద్ధం చేయాలి అంటూ 4 నిమిషాలకు పూస గుచ్చినట్లు వీడియోలో చెప్పాడు చిరు. ఇది చూసిన తర్వాత చిరు వంటల్లో ఈయన ఇంతటి ఘనాపాటా అనుకుంటున్నారు అభిమానులు. చిరంజీవి KFC రెసిపీ కూడా వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. 

More Related Stories