English   

యష్ KGF 2లో మరో బాలీవుడ్ స్టార్...

KGF2 Raveena Tandon.jpg
2020-02-10 08:51:07

కేజిఎఫ్ 2 సినిమాపై ఇప్పటికే ఇండియన్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. తొలిభాగం అంత పెద్ద విజయం సాధిస్తుందని వాళ్లు కూడా ఊహించలేదు.. కానీ అది అలా జరిగిపోయింది. దాంతో రెండో భాగం కోసం మరింత ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరీ ముఖ్యంగా నటీనటుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తొలి భాగం అంతా కన్నడ నటులతో నింపేసిన ఈ దర్శకుడు రెండో భాగం కోసం మాత్రం బాలీవుడ్ నటులను ఎక్కువగా తీసుకుంటున్నాడు. హిందీ మార్కెట్ కోసం వాళ్లను కూడా తన సినిమాలోకి తీసుకొస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయనతో పాటు మరికొంత మంది ఉత్తరాది నటులు కూడా కేజిఎఫ్ 2లో భాగమయ్యారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతోంది. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా నటించిన రవీనా టాండన్ కేజిఎఫ్ 2లో కీలక పాత్రలో నటించబోతోంది. ఎవరైతే డెత్ వారెంట్ విడుదల చేస్తారో వాళ్లు ఈ సినిమాలోకి వచ్చేసారు అంటూ ట్వీట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీన్ని బట్టి సినిమాలో యష్ కు డెత్ వారెంట్ విడుదల చేసే ఆఫీసర్ పాత్రలో రవీనా టాండన్ నటించబోతోందని అర్థమైపోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.

ముందు సమ్మర్లో విడుదల చేయాలనుకున్నా కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో.. రాజమౌళి వదిలేసిన జులై 30వ తేదీని తీసుకోవాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్.

More Related Stories