KGF 2 వాయిదా.. కరోనా కాటుకు 2021కి పోస్ట్‌పోన్..

కెజియఫ్ 2 సినిమా కోసం ఇండియన్ సినిమా అంతా వేచి చూస్తుంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో మరో సినిమా కోసం చూస్తున్నారంటే అది కేవలం కెజియఫ్ మాత్రమే. తొలి భాగం చూసిన తర్వాత.. అది ముగించిన తీరు చూసిన తర్వాత రెండో భాగంపై అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి. పైగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం కూడా అలా ఉంది మరి. ఇక ఇప్పుడు రెండో భాగం కోసం మరింత కష్టపడుతున్నాడు ఈయన. పైగా స్టార్ క్యాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండో భాగంలో స్టార్స్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్. ఇందులో భాగంగానే సంజయ్ దత్ కూడా ఇందులో భాగమైపోయాడు. ఈయనే మెయిన్ విలన్ అధీరాగా నటిస్తున్నాడు. కేజీయఫ్ 200 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇక ఇప్పుడు రెండో భాగం 400 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది. కేజీయఫ్‌లో ప్రధాన కారెక్టర్ అధీర. ఆ పాత్రను పరిచయం చేసాడు కానీ ఫేస్ చూపించలేదు దర్శకుడు. సినిమాలో మెయిన్ విలన్ బాబాయ్ ఈయన. తొలి భాగంలో చనిపోయినట్లు చూపించారు కానీ ఆ పాత్ర బతికే ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రను ఛాప్టర్ 2లో సంజయ్ దత్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం 2021కి వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుంది. ముందు నుంచి అనుకుంటున్నట్లు 2020 అక్టోబర్ 23న ఈ చిత్రం విడుదల కావడం కష్టమే. లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు షూటింగ్ జరగలేదు దాంతో వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిపోయింది ఈ చిత్రం. దాంతో అభిమానులకు నిరాశ తప్పడం లేదు. కానీ ఎప్పుడొచ్చినా కూడా కచ్చితంగా సంచలనం సృష్టించడం మాత్రం ఖాయం అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో రవీనా టాండన్, రావు రమేష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.