KGF 2 అదిరిపోయిన అధీర.. సంజయ్ లుక్ అదుర్స్..

సరిగ్గా మూడేళ్ల కిందట బాహుబలి 2 సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు వేచి చూశారో.. ఇప్పుడు కేజీయఫ్ 2 సినిమా కోసం ఇండియన్ సినిమా అంతా వేచి చూస్తుంది. తొలి భాగం చూసిన తర్వాత.. అది ముగించిన తీరు చూసిన తర్వాత రెండో భాగంపై అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి. పైగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం కూడా అలా ఉంది మరి. ఇక ఇప్పుడు రెండో భాగం కోసం మరింత కష్టపడుతున్నాడు ఈయన. పైగా స్టార్ క్యాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండో భాగంలో స్టార్స్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్. ఇందులో భాగంగానే సంజయ్ దత్ కూడా ఇందులో భాగంగా మారుతున్నాడు. కేజీయఫ్ 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు రెండో భాగం 300 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది.
తాజాగా సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. కేజీయఫ్లో ప్రధాన కారెక్టర్ అధీర. ఆ పాత్రను పరిచయం చేసాడు కానీ ఫేస్ చూపించలేదు దర్శకుడు. సినిమాలో మెయిన్ విలన్ బాబాయ్ ఈయన. తొలి భాగంలో చనిపోయినట్లు చూపించారు కానీ ఆ పాత్ర బతికే ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రను ఛాప్టర్ 2లో సంజయ్ దత్ చేస్తున్నాడు. తాజాగా ఈ లుక్ విడుదలైంది. సంజయ్ లుక్ కేక పెట్టిస్తుంది. ఈ లుక్ కేజీయఫ్ 2పై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. అక్టోబర్ 23న విడుదల తేదీ అనౌన్స్ చేశారు కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2021కి సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సంజయ్ లుక్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా కేజిఎఫ్ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.