English   

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ 2 టీజర్

KGF 2 Teaser
2021-01-15 20:50:47

పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అయిన సినిమా "కేజీఎఫ్ చాప్టర్ 1". ఈ సినిమా  కు సీక్వెల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్-2 ను తెరకెక్కిస్తున్నారు.  చాప్టర్ 1 విజయం తరవాత కేజీఎఫ్2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అంచనాలకు రీచ్ అయ్యేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా హైప్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులను సినిమాలో భాగం చేశారు. ఇక ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. నిజానికి టీజర్ కు ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రేక్షకుల అంచనాలకు మించి టీజర్ ఉండటం తో రీకార్డులు బద్దలు కొడుతోంది. మొత్తంగా ఇప్పటివరకు టీజర్ కు 150 మిలియన్ కు పైగా వ్యూవ్స్, 7.5 మిలియన్ కు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక టీజరే ఈ రేంజ్ లో ఉందంటే...సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరి కేజీఎఫ్ 2 ఆ అంచనాలను రీచ్ అవుతుందా.? లేదా? అన్నది చూడాలి.

More Related Stories