English   

కెజియఫ్ రేటింగ్స్ తెలుగులో కూడా కుమ్మేస్తున్నాయిగా..

KGF Chapter 1
2020-07-08 07:40:39

ఓ కన్నడ సినిమా తెలుగులో ఇంతగా అరాచకం చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ రెండేళ్ల కింద ఇదే జరిగింది. అప్పటి వరకు కన్నడ సినిమాలు తెలుగులో డబ్ చేస్తే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావని నిర్మాతలను ఎగతాళి చేసేవాళ్లు. అలాంటిది కెజియఫ్ మాత్రం దుమ్ము దులిపేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఏకంగా 20 కోట్ల వరకు వసూలు చేసి సత్తా చూపించింది. రెండో భాగానికి 30 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు రైట్స్ కోసం. దిల్ రాజు ఈ రైట్స్ తీసుకున్నాడు కూడా. ఇదిలా ఉంటే సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా కూడా ఇప్పటికీ కెజియఫ్ తొలి భాగంపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. విడుదలైన ఏడాదిన్నర తర్వాత ఈ మధ్యే మాటీవీలో ప్రీమియర్ వేసారు దర్శక నిర్మాతలు. 

ఈ సినిమా ప్రీమియర్ వేసిన సమయంలో సోషల్ మీడియాలో కూడా రప్ఫాడించేసారు అభిమానులు. ఎప్పటికప్పుడు కెజియఫ్ గురించి పిల్లల నుంచి పెద్దల వరకు అంతా టీవీల ముందే అతుక్కుపోయారు. కచ్చితంగా ఈ చిత్రం రేటింగ్స్ పరంగా రికార్డులు తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు యాజమాన్యం. ప్రస్తుతం కెజియఫ్ 2పై కూడా అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రం అక్టోబర్ 23న విడుదల అవుతుందని ముందు చెప్పినా కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అది కుదిరేలా కనిపించడం లేదు. ఈ చిత్రం కచ్చితంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చేలా కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యశ్ ఈ ఒక్క సినిమాతోనే నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. 

More Related Stories