English   

కే.జీ.ఎఫ్: చాప్టర్ 2.. రిలేజ్ డేట్ మారింది 

KGF Chapter 2
2020-01-25 18:33:14

2018 లో వచ్చిన కే.జీ.ఎఫ్: చాప్టర్ 1 సినిమాకు సల్లామ్ రాఖీభాయ్.. అంటూ సలామ్ కొట్టారు జనాలు. కన్నడంలో యష్ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా కే.జీ.ఎఫ్. ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా.. బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి సౌత్ సినిమాల సత్తా ఏంటో నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కే.జీ.ఎఫ్: చాప్టర్ 2 రూపొందుతోంది. 

ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. అది దృష్టిలో పెట్టుకొని.. అందుకు ఏ మాత్రం తగ్గకుండా భారీగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కే.జీ.ఎఫ్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ముందుగా అనుకున్నట్టు అన్నీ జరిగితే.. ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా రిలీజ్ డేట్ మారినట్టు సమాచారం. 

భారీ చిత్రం కావటంతో షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం లేదట. దీనికి తోడు సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో.. ఆ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు చిత్రయూనిట్‌ చాలా సమయం తీసుకుంటున్నట్టు వినిపిస్తోంది. దీంతో షూటింగ్ ఇంకా ఆలస్యమవుతోందట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా జూలైలో కాకుండా కే.జీ.ఎఫ్: చాప్టర్ 2ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

దీని వల్ల షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కోసం కొంత సమయం దొరకుతుందని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా కే.జీ.ఎఫ్ 2 విడుదల వాయిదా పడటం ఖాయమంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ కీ రోల్ పోషిస్తున్నాడు. అలాగే వెటరన్ బ్యూటీ ర‌వీనా టాండ‌న్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు

More Related Stories