English   

ఖుష్భూ ఇంట తీవ్ర విషాదం...చివరి చూపు కూడా నోచుకోక 

khushbu sundar
2020-06-02 07:14:31

మాయదారి కరోనా ఎవరినీ వదలడం లేదు..ఇప్పటికే దీని బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నారు. నిన్నటికి నిన్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కన్నుమూసారు. ఇప్పుడు ఇదే కరోనా వలన నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ సమీప బంధువు కరోనా వైరస్‌ సోకి మృతి చెందడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందంజలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 వేల మందికి పైగా కరోనా బాధితులుండగా వారిలో రెండు వేల మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న ఖుష్బూ సమీప బంధువు కూడా ఒకరు కరోనా సోకి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. దీంతో సినీరంగ ప్రముఖులు, అభిమానులు ఆమెకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. అయితే చనిపోయింది ఖుష్భూ వదిన అని తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వదిన అంత్యక్రియలకు ఆమె వెళ్లలేకపోయారు. చెన్నై నుంచి ముంబై వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోయారని అంటున్నారు. 

More Related Stories