English   

ఎయిర్ పోర్ట్ లో కైరా అందాలు.. 

Kiara-advani
2018-05-19 15:45:25

మొన్న‌టి వ‌ర‌కు కైరాఅద్వాని అంటే బాలీవుడ్ కు మాత్ర‌మే సొంతం. కానీ ఇప్పుడు ఇక్క‌డ కూడా ఈ భామ‌కు మంచి ఇమేజ్ వ‌చ్చింది. భ‌ర‌త్ అనే నేనుతో తెలుగులోనూ స్టార్ అయిపోయింది కైరా. పైగా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలోనూ హీరోయిన్ గా క‌మిటైంది. ఓ షెడ్యూల్ లో పాల్గొని పూర్తి చేసింది కూడా. ఇప్పుడు మ‌ళ్లీ ముంబైకి వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ షూటింగ్ బ్యాంకాక్ లో జ‌రుగుతుంది. అక్క‌డే మే 12 నుంచి జ‌రుగుతుంది ఈ చిత్ర షూటింగ్. త‌న పార్ట్ పూర్తి చేసుకుని ముంబైకి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఎయిర్ పోర్ట్ లోనే అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ఈ భామ‌. న‌డుము అందాలు చూపిస్తూ.. పైన వైట్ క‌ల‌ర్ టాప్ తో వ‌య్యారాలు పోయింది కైరా. ఈమె అందాలు చూసి అక్క‌డున్న వాళ్ల‌తో పాటు కెమెరాలు కూడా పండ‌గ చేసుకున్నాయి. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ సినిమా కూడా హిట్ అయితే కైరా ఇక్క‌డే సెటిల్ అయిపోవ‌డం ఖాయం. 

More Related Stories