English   

కైరాఅద్వానీ.. లేడీ పీకే..!

Kiara-Advani-Exhibit-Magazine,
2018-08-11 18:13:26

అమీర్ ఖాన్ పీకే సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా..! అయినా అంత ఈజీగా మ‌రిచిపోయే సినిమా కాదు క‌దా..! పైగా ఫ‌స్ట్ లుక్ తోనే సంచ‌ల‌నం సృష్టించాడు అమీర్. రేడియో ప‌ట్టుకుని సూప‌ర్ స్టిల్ తో పిచ్చెక్కించాడు మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్. ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఇలాంటి లుక్ తోనే వ‌చ్చింది. ఈమె కూడా రేడియో ప‌ట్టుకుని వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. హాట్ హాట్ గా థైస్ చూపిస్తూ భుజంపై రేడియో పెట్టుకుని ఎగ్జిబిట్ మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది కైరా అద్వానీ.  ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ భామ పేరు బాగా వినిపిస్తుంది. భ‌ర‌త్ అనే నేనుతో తెలుగులోనూ స్టార్ అయిపోయింది కైరా. పైగా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటే విజ‌య్ సినిమాలోనూ హీరోయిన్ గా కైరాను అనుకుంటున్నారు. అట్లీకుమార్ తెర‌కెక్కించ‌బోయే సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కానుంది కైరా. ఇక స్టార్ హీరోలే వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు ఇస్తుండ‌టంతో అందాల ఖ‌జానా కూడా తెరిచేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె అందాలు చూసి కుర్రాళ్ల‌ క‌ళ్ల‌తో పాటు కెమెర క‌ళ్లు కూడా పండ‌గ చేసుకున్నాయి. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ సినిమా కూడా హిట్ అయితే కైరా ఇక్క‌డే సెటిల్ అయిపోవ‌డం ఖాయం.

More Related Stories