English   

భరత్ భామకు మరో బాలీవుడ్ ఆఫర్

Kiara-Advani
2018-07-09 18:34:46

ఇది బయోపిక్కుల కాలం అని అన్ని ఉడ్స్ పాడుకునే టైమ్ వచ్చింది. వరుసగా చాలా భాషల్లో బయోపిక్స్ వస్తున్నాయి. సూపర్ హిట్స్ అవుతున్నాయి. తమిళ్ లో కాలా కూడా ఓ బయోపిక్ లాంటిదే. మళయాలంలో ఓ మూడు బయోపిక్స్ ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ఇటు తెలుగులో కూడా రెండున్నాయి. ఇక బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఈ బయోపిక్స్ బాక్సాఫీస్ మోత మోగిస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన సంజు బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి మరో బయోపిక్ రాబోతోంది. అయితే ఈయన ఓ రియల్ హీరో. అతని కథను రీల్ హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించబోతున్నాడు. అతని సరసన భరత్ అనేనేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఇంతకీ ఈ బయోపిక్ ఎవరిదీ అంటారా..?

ఇండియా, పాకిస్తాన్ వార్స్ లో కార్గిల్ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఆ యుద్ధంలో అద్భుతమైన పోరాటపటిమ చూపించి అమరుడైన ఆఫీసర్  విక్రమ్ బత్రా కథతోనే ఈ బయోపిక్ రాబోతోంది. ఈయనెంతటి వీరుడంటే.. పాకిస్తాన్ సైన్యం కూడా విక్రమ్ బత్రాను ‘షేర్ షా’ అని పిలుస్తుంది. అంతటి ధీశాలి కాబట్టే భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతం ప్రదానం చేసే పరమ వీరచక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కైరాను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం నిర్మాత కరణ్ జోహార్. 

ఈ బయోపిక్ కు నిర్మాత కూడా కరణ్ జోహార్. కరణ్ రీసెంట్ గా నిర్మించిన లస్ట్ స్టోరీస్ లో కైరా అద్వానీ కూడా ఉంది కదా. ఆ స్టోరీస్ లో తన పర్ఫార్మెన్స్ నచ్చే ఈ సినిమాలో రిపీట్ చేశాడట. ఏదేమైనా కళంక్ అనే మరో బాలీవుడ్  మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తోన్న కైరా తెలుగులోనూ రామ్  చరణ్ సరసన బోయపాటి సినిమాలో నటిస్తోంది. 

More Related Stories