English   

కైరా అద్వానీ.. ముద్దుల యుద్ధానికి రెడీ 

Kiara-Advani-arjun-reddy

భ‌ర‌త్అనేనేనుతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ సినిమాలో అమ్మ‌డి సోయాగాల‌కు పెద్ద‌గా ప్రిఫ‌రెన్స్ లేకున్నా లుక్స్ తోనే ఆక‌ట్టుకుంది. త‌ర్వాత బాలీవుడ్ లో ల‌స్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో బిగ్రేడ్ సీన్స్ చేసి సెన్షేష‌న్ క్రియేట్ చేసిన ఈ భామ ఇప్పుడు ఒకే సారి రెండు షాకులు ఇవ్వ‌బోతోంది. ల‌స్ట్ స్టోరీస్ తోనే త‌న‌కు క‌థ న‌చ్చితే ఏమైనా చేస్తాను అనే సందేశాలు పంపిన ఈ భామ అందుకు త‌గ్గట్టుగానే ముద్దుల యుద్ధానికి సిద్ధ‌మైంది. అవును.. తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన  అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ కైరా అద్వానీయే.. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేయ‌బోతోన్న ఈ మూవీలో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కైరా న‌టించ‌డం ఓ షాక్ అయితే.. ఇదే సినిమాలో సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఓ ఆల్ టైమ్ సూప‌ర్ హిట్ సాంగ్ ను ఈ మూవీలో రీమేక్ చేయ‌బోతున్నారు..  చాలాయేళ్ల క్రితం ప్ర‌భుదేవా హీరోగా వ‌చ్చిన ప్రేమికుడు సినిమాలో ఊర్వ‌సి ఊర్వ‌సి అనే పాట‌ను అంత ఈజీగా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. ఇప్పుడు ఈ పాట‌నే అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ లో రీ మిక్స్ చేయ‌బోతున్నారు. ఆ మిక్స్ లో ఆడిపాడే భామ కైరానేన‌ట‌. మొత్తంగా క్యూట్ గా ఎంట‌ర్ అయ్యి హాట్ గా దూసుకుపోతోన్న కైరాకు ఈ రీమేక్ బాలీవుడ్ లో ఎలాంటి ప్లేస్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories