English   

తమిళ్ లాంచ్ కోసం కియారాకి బంపర్ ఆఫర్ !

 Kiara Advani
2019-08-10 09:16:06

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కియరా అద్వాని మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత చేసిన వినయ విదేయ రామ సినిమా డిజాస్టర్ గా నిలిచినా ఆమెకి తాజాగా కబీర్ సింగ్ సినిమాతో మళ్ళీ లైన్ లోకి వచ్చేసింది. నిజానికి 2014లో పగ్లీ అనే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చినా ఆమె ఎంఎస్ ధోని సినిమాతో గుర్తింపు పొందింది. అయితే ఆమెకి కబీర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. దీంతో ఆమెను తన సినిమాలో నటింప చేయాలని తమిళ అగ్ర హీరో విజయ్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో "బిగిల్" (తెలుగులో విజిల్) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఒకరకంగా తమిళ్ లాంచింగ్ సినిమానే విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన పడితే కాదను కుంటుందా మరి. చూద్దాం ఏమవుతుందో ? 

More Related Stories