English   

పిచ్చెక్కిస్తున్న మ‌హేశ్ ల‌వ‌ర్.. 

Kiara- Alia- Advani
2018-03-12 08:28:32

మ‌హేశ్ ల‌వ‌ర్ ఏంటి.. పిచ్చెక్కించ‌డం ఏంటి.. ఇంత‌కీ ఎవ‌రా ల‌వ‌ర్ అనుకుంటున్నారా..? ఇప్పుడు భ‌ర‌త్ అనేనేనులో మ‌హేశ్ కు జోడీగా న‌టిస్తున్న కైరా అద్వాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఎంతైనా బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ముద్దుగుమ్మ క‌దా.. ఇక్క‌డి అలవాట్లు ఇంకా సోక‌లేదు. అందుకే ఇప్ప‌టికీ బాలీవుడ్ బ్యూటీ రేంజ్ లో అందాల‌న్నీ ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా కైరా చేసిన ఓ ఫోటోషూట్ చేసి అంతా షాక్ అయ్యారు. అస‌లు ఈ భామేనా ఎమ్మెస్ ధోనీ సినిమాలో అంతా అమాయ‌కంగా న‌టించింది అనుకున్నారంతా. అస‌లు బ‌ట్ట‌లేసుకోడ‌మే చిరాకు   అన్న‌ట్లుగా మ‌తులు పోగొట్టేసింది కైరా. భ‌ర‌త్ అనే నేనులో కూడా గ్లామ‌ర‌స్ రోల్ లో క‌నిపిస్తుంది కైరా. లొకేష‌న్ లో అమ్మాయిగారి ఫోటోలు కొన్ని బ‌య‌టికి వ‌చ్చాయి. ఇందులో బ్యూటీ ఫుల్ గ్లామ‌ర్ అవ‌తారంలో క‌నిపిస్తుంది. సీన్స్ లోనే ఇలా ఉంటే.. పాట‌ల్లో ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో రెచ్చి పోయి ఉంటుందో..? సోనాలి బింద్రే.. బిపాషా బ‌సు.. అమీషా ప‌టేల్.. ప్రీతిజింటా లాంటి బాలీవుడ్ భామ‌ల త‌ర్వాత కైరాతో జోడీ క‌డుతున్నాడు సూప‌ర్ స్టార్. ఎప్రిల్ 20న భ‌ర‌త్ అనే నేను విడుద‌ల కానుంది. మ‌రి కైరా వేడిని త‌ట్టుకోడానికి ఏ థ‌ర్మామీట‌ర్ ను వాడాలో ఏమో..? అన్న‌ట్లు భ‌ర‌త్ అనే నేను విడుద‌ల‌కు ముందే రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలో హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories