English   

కిల్లర్ మూవీ రివ్యూ

Killer Movie Review
2019-06-07 18:00:50

బిచ్చగాడు సినిమాతో అమ్మ సెంటిమెంట్ తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించి తెలుగు వారికి సుపరిచితమయిన విజయ్‌ ఆంటోని తాజాగా కిల్లర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్‌ ఆంటోనికి తోడుగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూడా ఉండడంతో ఈ సినిమా మీద మంచిగానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి 'కిల్లర్‌' సినిమా అంచనాలకు మేర ఆకట్టుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

కధ :

వైజాగ్ లోని ఓ మారుమూల ఒక గుర్తు తెలియని శవం దొరుకుతుంది, ఆ శవం ఎవరిదో తెలుసుకోడానికి పోలీస్ ఆఫీసర్ కార్తికేయ (అర్జున్ సార్జా) & టీం రంగంలోకి దిగుతుంది. హత్య కాబడిన వ్యక్తి ఎవరు అనే విషయం తెలుసుకొనే క్రమంలో ఆ వ్యక్తి ఆఖరిసారి కనిపించింది ధరణి (ఆషిమా నర్వాల్) ఇంటి దగ్గరేనని తెలుసుకొంటారు. అదే తరుణంలో ధరణి ఉండే అపార్ట్మెంట్ ఫ్లోర్ లోనే ఉండే ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ)ని కూడా ప్రశ్నిస్తాడు. మొదట్లో ఆ హత్యకు ధరణి & ప్రభాకర్ కు ఎలాంటి సంబంధం లేదనుకున్న కార్తికేయకు ఆ కేసును మరింత లోతుగా పరిశీలించే కొద్దీ నమ్మలేని నిజాలు బయటకొస్తుంటాయి. అస‌లు ప్ర‌భాక‌ర్ ఎవ‌రు? వైజాగ్ ఎందుకు వ‌చ్చాడు? ప‌్ర‌భాక‌ర్‌కి, జ‌యంతి మ‌ధ్య ఉన్న ప్రేమ నిజ‌మేనా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

ప్రతి పది సినిమాలల్లో మూడు దాదాపుగా క్రైమ్ థ్రిల్ల‌ర్స్ గానే ఉంటున్నాయి, ఒక్క మర్డర్, లేదా రేప్, లేదా కిడ్నాప్ లాంటి ఇంసిడెంట్ ని పట్టుకుని దాన్ని చేదించే పోలీస్ ఆఫీసర్ కోణం నుండి ఈ సినిమా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మే కిల్ల‌ర్‌. ఈ సినిమా దర్శకుడు కథ కంటే కథనం బలంగా రాసుకున్నాడు. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేయగలిగాడు. ఎక్కడిఅక్కడ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంది కాబట్టి పెద్దగా బోర్ గా ఉండదు. కాకపోతే పాటల మాత్రమే కావాలని ఇరికించినట్లుగా ఎబ్బెట్టుగా ఉన్నాయి. జరిగిన హత్య చుట్టూ అల్లిన కధ బానే ఉంది కానీ ఆ మిస్టరీ రివీల్ చేయడంలో మాత్రం డైరెక్టర్ విఫలమయ్యాడు. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే విజ‌య్ ఆంటోని సీరియ‌స్ గా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో న‌టించిన మ‌రో హీరో యాక్ష‌న్ కింగ్ అర్జున్ కి అభిమన్యుడు తర్వాత మంచి రోల్ దొరికింది. ఆషిమా న‌ర్వాల్ తన పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. సీత‌, నాజ‌ర్ లాంటి మిగతా నటీనటులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఫైనల్ గా : కిల్లర్ ఎగ్జైటింగ్ లైన్ తో వచ్చిన ఎగ్జైటింగ్ మూవీ.

రేటింగ్ : 2.75 /5

More Related Stories