English   

కిరాక్ పార్టీ.. ఎంతొచ్చింది.. ఎంత తేవాలి..? 

Kirrak-Party
2018-03-21 15:10:21

కిరాక్ పార్టీ.. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రంపై అంచ‌నాలు  భారీగా ఉన్నాయి. కానీ విడుద‌ల త‌ర్వాత ఒక్క‌సారిగా నీరుగారిపోయాయి. ఎందుకంటే సినిమా ఊహించిన రేంజ్ లో లేదు. కానీ వ‌సూళ్లు మాత్రం ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి. తొలిరోజే నిఖిల్ కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత‌గా 2.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇక ఇప్ప‌టి వ‌రకు నాలుగు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 6 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. కిరాక్ పార్టీ సేఫ్ కావాలంటే 10 కోట్ల మార్క్ అందుకోవాలి. మ‌రోవైపు వీక్ డేస్ లో వ‌సూళ్లు చూస్తుంటేనేమో యావ‌రేజ్ గానే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేష‌న్ లో కిరాక్ పార్టీ సేఫ్ కావ‌డం కాస్త క‌ష్టంగానే క‌నిపిస్తుంది. ఏం చేసినా ఈ రెండు మూడు రోజుల్లోనే మాయ చేయాలి. ఆ త‌ర్వాత మార్చ్ 23న బోలెడు సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. క‌ళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేతో పాటు శ్రీ‌విష్ణు నీదినాది ఒకేక‌థ లాంటి సినిమాలు వ‌స్తున్నాయి. వీటిపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. దాంతో ఈ ఉన్న కాస్త టైమ్ లో కిరాక్ పార్టీ మ‌రో 3 కోట్లైనా తీసుకొస్తుందా అనేది అనుమాన‌మే. ఈ లెక్క‌న కిరాక్ పార్టీ అబౌ యావ‌రేజ్ గా మిగిలే సూచ‌న‌లే ఉన్నాయి కానీ హిట్ అనిపించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories