English   

నిఖిల్ సాంగ్ కిరాక్ ఉందిగా..

kirrak party
2018-02-25 14:35:11

డిఫరెంట్ స్టోరీస్ తో ట్రెమండస్ హిట్స్ కొడుతోన్న హీరో నిఖిల్. మొదట్లో రవితేజను అనుకరించినా.. స్వామిరారాతో దారిలో పడ్డాడు. ప్రస్తుతం 2016లో కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీగా రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీతో కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు నిఖిల్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య వచ్చిన పాట కూడా ఆకట్టుకుంది. ఇవాళ కిరాక్ పార్టీ నుంచి ఓ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఒరిజినల్ పాటను మక్కీకి మక్కీగా దింపేసిన ఈ పాట కూడా బావుంది. ఈ పాట కన్నడలో బిగ్గెస్ట్ హిట్.. ఇప్పటికీ యూత్ ఫుల్ పార్టీస్ లో హల్చల్ చేస్తుంటుంది. చూస్తుంటే తెలుగులోనూ అలాగే ఉండేలా ఉంది. గురువారం సాయంత్రం కలిసొచ్చిందిరా.. అంటూ సాగే ఈ పాట మెలోడియస్ గా వినిపిస్తోంది. కలలోనా కనిపించి అనే పదాల మధ్య వచ్చే అరెరెరెరే.. అలెలెలెలే సౌండింగ్స్ అదిరిపోయాయి. 
కన్నడ కిరిక్ పార్టీకి సంగీతం అందించిన బి. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికీ సంగీత దర్శకుడు. అందుకే ఆల్రెడీ హిట్ అయిన ఆల్బమ్ కాబట్టి ట్యూన్స్ విషయంలో పెద్దగా ప్రాబ్లమ్ రాలేదు. అలాగే తెలుగులో రాకేందు మౌళి రాసిన ఈ పాట పాడింది కూడా సేమ్ సింగర్. విజయ్ ప్రకాష్..  ఈ పాట విన్న తర్వాత కిరిక్ పార్టీ మ్యాజిక్ ను తెలుగులోనూ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తోన్న నిఖిల్ మ్యూజిక్ పెద్ద ప్లస్ గా మారేలా ఉంది. మొత్తంగా ఈ నెల 2న విడుదల కావాల్సిన సినిమాను సమ్మర్ రేస్ లోకి స్ట్రాటజిక్ గా మార్చిన కిరాక్ పార్టీ మార్చి 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

More Related Stories