English   

నువ్వే చెప్పు నిఖిల్.. వాళ్ల ప‌రిస్థితేంటిప్పుడు..?

kirrak party nikhil (2)
2018-03-07 17:47:52

అంత‌గా ఇప్పుడు నిఖిల్ ఏం చేసాడు..? త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు క‌దా అనుకుంటున్నారా..? అవును.. త‌న ప‌ని చేయ‌డంతో పాటు ప‌క్కోళ్ల ప‌ని కూడా గండి కొడుతున్నాడు ఈ హీరో. అదేంటి అనుకుంటున్నారా..? గ‌త కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఎవ‌రంటే క‌చ్చితంగా మ‌రో ఆలోచ‌న లేకుండా నిఖిల్ పేరే చెబుతారు. కొన్నేళ్లుగా ఈయ‌న చేస్తోన్న సినిమాలు అలాంటివి. క‌థ న‌చ్చితే ట్రాక్ రికార్డ్ తో ప‌నిలేకుండా సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ మ‌ధ్యే కేశ‌వ‌తో మ‌రో హిట్ కొట్టాడు నిఖిల్. ఈ సినిమా కూడా కొత్త‌గానే ఉంది. ఇప్పుడిప్పుడే నిఖిల్ ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాస్తోన్న ద‌ర్శ‌కుల‌కు మంచి షాకిస్తున్నాడు ఈ కుర్రాడు. కేశ‌వ త‌ర్వాత నిఖిల్ క‌మిటైన రెండు సినిమాలు రీమేక్ లే. క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన కిర్రాక్ పార్టీ సినిమా రీమేక్ తో  మార్చ్ 16న వ‌స్తున్నాడు నిఖిల్.

కిర్రాక్ పార్టీ అంటే ఏదో కాలేజ్ క‌థ కాబ‌ట్టి క‌నెక్ట్ అయ్యాడు అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌రోసారి కూడా రీమేక్ సినిమాతోనే బిజీ అయ్యాడు నిఖిల్. ఈ సారి త‌మిళ హిట్ క‌ణిత‌న్ రీమేక్ తో వ‌స్తున్నాడు. ఇది ఫేక్ స‌ర్టిఫికేట్ల చుట్టూ సాగే థ్రిల్ల‌ర్. ర‌వితేజ‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని భావించాడు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. అయితే నిఖిల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాడు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా హ‌న్సిక న‌టిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజ‌మైతే నిఖిల్ కు హ‌న్సిక సెట్ అవుతుందా అనేది ఆస‌క్తికరంగా మారిందిప్పుడు. ఈ రెండు సినిమాల‌తో పాటు దిల్ రాజు నిర్మాణంలో కార్తికేయ 2 చేయ‌డానికి ఫిక్స‌య్యాడు నిఖిల్. ఇలా వ‌ర‌స సినిమాల‌తో దున్నేస్తున్నాడు నిఖిల్. కానీ కొత్త క‌థ‌ల వైపు అడుగేస్తోన్న కుర్ర హీరో కూడా ఇలా రీమేక్ ల‌ను ఎంచుకోవ‌డ‌మే ఇక్క‌డి ద‌ర్శ‌కుల‌కు కొంచెం మింగుడు ప‌డ‌టం లేదు.

More Related Stories