English   

ప్రివ్యూ: కిరాక్ పార్టీ 

Kirrak-Party

కిరాక్ పార్టీ.. కిరాక్ పార్టీ.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఒక‌టి రెండు కాదు.. నాలుగు వారాలు అయిపోయింది బాక్సాఫీస్ క‌ళ త‌ప్పి. అప్పుడెప్పుడో ఫిబ్ర‌వ‌రి 10న వ‌చ్చిన తొలిప్రేమ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా లేదు. రాలేదు.. వ‌చ్చినా నిల‌బ‌డ‌లేదు. దాంతో ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఆశ‌ల‌న్నీ కిరాక్ పార్టీపైనే ఉన్నాయి. పైగా కొత్త సీజ‌న్ కు తెర‌తీస్తున్నాడు ఈ కిరాక్ కుర్రాళ్ళు. మార్చ్ 16 నుంచి మే 25 వ‌ర‌కు నాన్ స్టాప్ సినిమాల జాత‌ర జ‌ర‌గ‌నుంది. అంత‌పెద్ద సినిమా సీజ‌న్ కు ఓపెనింగ్ చేస్తున్నాడు నిఖిల్. ఈయ‌న వ‌ర‌స విజ‌యాలు కిరాక్ పార్టీపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. పైగా బిజినెస్ కూడా దాదాపు 15 కోట్లు జ‌రిగింది. యూత్ ఫుల్ సినిమా కావ‌డం.. పైగా ఎగ్జామ్స్ కూడా అయిపోవ‌డంతో కిరాక్ పార్టీకి ఓపెనింగ్స్ కూడా బానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తొలి వారంలోనే ఈ చిత్రం క‌చ్చితంగా సేఫ్ జోన్ కు వ‌చ్చి లాభాల పంట పండిస్తుంద‌ని న‌మ్ముతున్నారు. పైగా ఈ చిత్రానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా పోటీ కూడా లేదు. ఈ వారం క‌ర్త‌వ్యం సినిమా వ‌స్తున్నా అది నార్మ‌ల్ ఆడియన్స్ ను మెప్పించ‌డం క‌ష్టమే. సినిమా ఎంత బాగున్నా ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు వ‌స్తారా అనేది అనుమానం. దాంతో క‌మ‌ర్షియ‌ల్ గా ఇప్పుడు కిరాక్ పార్టీకే ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్ర ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories