English   

కిరాక్ పార్టీ రివ్యూ

Kirrak-Party-Review
2018-03-16 15:57:10

క‌న్న‌డ‌లో 50 కోట్లు వ‌సూలు చేసిన సినిమా కిరిక్ పార్టీ. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌న్నింటినీ చిన్న సినిమాగా వ‌చ్చి తుడిచేసింది కిరిక్ పార్టీ. ఆ సినిమాలో అంత‌గా ఏముందో అని తెలుగులోనూ రీమేక్ చేసారు. వ‌ర‌స విజ‌యాల నిఖిల్ హీరో కావ‌డంతో ఇక్క‌డ కూడా అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి తెలుగులో కిరాక్ పార్టీ ఎలా ఉంది..? క‌న్న‌డ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? 

క‌థ‌: కృష్ణ‌(నిఖిల్) ఇంజ‌నీరింగ్ స్టూడెంట్. కాలేజ్ డేస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అత‌డికి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది. హ్యాపీగా.. జాలీగా ఉండే కృష్ణ జీవితంలోకి మీరా(సిమ్రాన్ ప‌రీంజా) వ‌స్తుంది. ఆమె కృష్ణ‌కు సీనియ‌ర్. అయినా స‌రే చూడ‌గానే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కూడా క‌ష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంది. స‌రిగ్గా అదే టైమ్ లో ఊహించని విధంగా మీరా చ‌నిపోతుంది. ఆమె జ్ఞాపకాల‌తోనే గడుపుతున్న కృష్ణ జీవితంలోకి స‌త్య (సంయుక్తా హెగ్డే) వ‌స్తుంది. కృష్ణ‌ను ప్రేమిస్తుంటుంది. మ‌రోవైపు కాలేజ్ లో లీడ‌ర్ అవుతాడు కృష్ణ‌. అక్క‌డ్నుంచి కృష్ణ జీవితం ఎలా మారింది.. స‌త్య‌ను ప్రేమించాడా.. అస‌లు మీరా ఎలా చ‌నిపోతుంది అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం: హ్యాపీడేస్.. శివ‌.. ఈ రెండు సినిమాలు తెలుగు ఇండ‌స్ట్రీపై చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. ఎంత‌గా అంటే కాలేజ్ క‌థ వ‌చ్చింది అంటే ఈ రెండు సినిమాల్లో నుంచే స్పూర్తి పొందాలి. అలా లేదంటే అబ‌ద్ధం చెప్పిన‌ట్లే లెక్క‌. మాస్ అయితే శివ‌.. క్లాస్ అయితే హ్యాపీడేస్. ఇప్పుడు క్లాస్ మాస్ క‌లిపి కొట్టాడు కిరాక్ పార్టీ. ఇందులో కొత్త క‌థంటూ ఏమీ ఉండ‌దు. చాలా సినిమాల్లో చూసిందే. కాక‌పోతే ట్రెండ్ కు త‌గ్గ‌ట్లుగా కాస్త మార్చి చేసిన క‌థ‌. తొలి సీన్ నుంచే యూత్ ను టార్గెట్ చేసాడు ద‌ర్శ‌కుడు. కాలేజ్ సీన్స్ అన్నీ బాగా రాసుకున్నాడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. హ్యాపీడేస్ ను గుర్తు చేసినా బాగానే అల‌రిస్తాయి. కామెడీ బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంది ఈ సీన్స్ లో. ముఖ్యంగా కార్ కోసం వ‌చ్చే సీన్స్.. ఫ‌స్టాఫ్ లో సిమ్రాన్ ప‌రీంజా వెంట‌ప‌డే సీన్స్ అన్నీ బాగా వ‌చ్చాయి.
 
ఇక క్యాంటీన్ గొడ‌వ‌లు.. క్యాంప‌ర్ అల్ల‌ర్లు అన్నీ కామ‌న్. ఒక్క‌సారి కృష్ణ లీడ‌ర్ అయిన త‌ర్వాత క‌థ‌లో వేగం త‌గ్గుతుంది. అక్క‌డ్నుంచీ కాస్త సైడ్ ట్రాక్ ప‌ట్టింది క‌థ‌. కాలేజ్ సీన్స్ పెట్ట‌డానికి స్కోప్ లేదు. అందుకే ఉన్న సీన్స్ తోనే స‌ర్దేసాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ చూసి సెకండాఫ్ అదిరిపోతుంది అనుకున్న వాళ్ల‌కు షాక్ త‌ప్ప‌దు. క‌థ లేక.. ముందుకు సాగ‌లేక‌.. ల్యాగ్ అయిపోయింది. కొన్ని సీన్లు అయితే త‌ప్ప‌క పెట్టిన‌ట్లుగా అనిపిస్తుంది. చివ‌ర్లో ఫేర్ వెల్ తో మ‌ళ్లీ పాత జ్ఞాపకాల‌ను గుర్తు చేసాడు ద‌ర్శ‌కుడు ఈ సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అవుతాయి. ముఖ్యంగా ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ కు ఈ కిరాక్ పార్టీ బాగానే అల‌రిస్తుంది.. క‌నెక్ట్ అవుతుంది కూడా.

న‌టీన‌టులు: నిఖిల్ బాగా న‌టించాడు. హ్యాపీడేస్ చేసాడు కాబ‌ట్టి అలాంటి కాలేజ్ కారెక్ట‌ర్ మ‌రోసారి ఇర‌గ‌దీసాడు నిఖిల్. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో అచ్చంగా బిటెక్ స్టూడెంట్ అయిపోయాడు నిఖిల్. న‌ట‌న కూడా బాగానే ఉంది. సిమ్రాన్ ప‌రీంజా కారెక్ట‌ర్ బాగా అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ఆమె పాత్ర ముగించిన తీరు మాత్రం ప్రేక్ష‌కుల‌కు క‌చ్చితంగా నిరాశ తెప్పిస్తుంది. మ‌రోలా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సెకండాఫ్ లో సంయుక్తా హెగ్డే ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. సొంత డ‌బ్బింగ్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ కారెక్ట‌ర్స్ లో రాకేందు మౌళి ఆక‌ట్టుకున్నాడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా బాగుంది. బ్ర‌హ్మాజీ కారెక్ట‌ర్ ఉన్నంత‌లో ఓకే. 

టెక్నిక‌ల్ టీం: కిరాక్ పార్టీకి చందూ మొండేటి మాట‌లు బాగానే సాయ‌ప‌డ్డాయి. అద్భుత‌మైన డైలాగులు రాయ‌క‌పోయినా.. సంద‌ర్భానుసారంగా వ‌చ్చే మాట‌లు మాత్రం బాగానే అనిపించాయి. సుధీర్ వ‌ర్మ‌కు టైట్ స్క్రీన్ ప్లే రాయ‌డానికి క‌థ స‌హ‌క‌రించ‌లేదు. ఉన్నంత‌లో ఆయ‌న బాగానే చేసాడు. అజ్నీష్ లోక్ నాథ్ అందించిన పాట‌లు బాగున్నాయి. ముఖ్యంగా లాస్ట్ బెంచ్ లో పాట కుర్రాళ్ళ‌తో విజిల్స్ వేయిస్తుంది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ వీక్. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించాయి. ద‌ర్శ‌కుడిగా శ‌ర‌ణ్ కొప్పిశెట్టి త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చాడు. 

చివ‌ర‌గా: హ్యాపీడేస్ తో క‌లిసి ప్రేమ‌మ్ గా కిరాక్ పార్టీ చేసుకోవ‌చ్చు..

రేటింగ్: 2.5/5 

More Related Stories