English   

పార్టీ ఉంది.. కానీ కిరాక్ లేదే..!

Kirrak-Party
2018-03-17 10:23:08

కిరాక్ పార్టీ.. చాలా రోజులుగా తెలుగులో బాగా వినిపించిన పేరు ఇది. క‌న్న‌డ‌లో ఇండ‌స్ట్రీ హిట్ అయిన ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచ‌నాలు ఉన్నాయి. దానికి కార‌ణం నిఖిల్ అయ్యుండొచ్చు.. చందూమొండేటి, సుధీర్ వ‌ర్మ లాంటి స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కులు ప‌ని చేసార‌ని అయ్యుండొచ్చు.. ఇలా కార‌ణం ఏదైనా సినిమాపై అంచ‌నాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పుడు సినిమా విడుద‌లైంది. కానీ టాక్ మాత్రం ఊహించినంత‌గా రాలేదు అనేది మాత్రం కాద‌న‌లేని వాస్త‌వం. అయితే సినిమా మాత్రం క‌మ‌ర్షియ‌ల్ గా క‌చ్చితంగా సేఫ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నెల రోజుల నుంచి బాక్సాఫీస్ డ‌ల్ గా ఉంది. ఒక్క సినిమా కూడా లేక ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో యావ‌రేజ్ టాక్ తోనే ఓపెన్ అయింది కిరాక్ పార్టీ. టాక్ ఎలా ఉన్నా.. యూత్ మాత్రం పిచ్చిపిచ్చిగా సినిమాకు క‌నెక్ట్ అయ్యేలా క‌నిపిస్తున్నారు. దానికితోడు ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు అయిపోయాయి. దాంతో క‌చ్చితంగా ఈ చిత్ర ఓపెనింగ్స్ భారీగా ఉండ‌బోతున్నాయి. 10 కోట్లు వ‌స్తే కిరాక్ పార్టీ సేఫ్ జోన్ లోకి వ‌స్తుంది. అయితే ఈ దూకుడు.. సినిమాపై ఉన్న అంచ‌నాలు.. తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్లు చూస్తుంటే తొలి వారంలోనే సినిమా సేఫ్ జోన్ కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే నిఖిల్ క‌ల‌లు క‌న్న బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం ఈ చిత్రంతో రావ‌డం క‌ష్ట‌మే. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

More Related Stories