English   

హ్యాపీడేస్+శివ‌= కిరాక్ పార్టీ..

Nikhil-kirrak-party

ఇప్పుడు ఇదే నిజం అనిపిస్తుంది కిరాక్ పార్టీ ట్రైల‌ర్ చూస్తుంటే. సాక్షాత్తు హీరో నిఖిల్ సైతం ఇదే చెప్పాడు. కాలేజ్ క‌థ‌లంటే శివ కానీ.. హ్యాపీడేస్ కానీ గుర్తొస్తాయి. యాక్ష‌న్ అయితే శివ‌.. యూత్ ఫుల్ అయితే హ్యాపీడేస్.. ఈ రెండు క‌థల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా ఉంటుంది మ‌న ద‌ర్శ‌కులపై. ఇక ఇప్పుడు విడుద‌లైన కిరాక్ పార్టీ ట్రైల‌ర్ కూడా ఇదే చూపిస్తుంది. కాలేజ్ క‌థ‌లంటే తెలుగు ఇండ‌స్ట్రీలో ముందుగా గుర్తొచ్చేది హ్యాపీడేస్. ప‌దేళ్ల కింద శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ఈ చిత్రం కొత్త ట్రెండ్ కు తెర‌తీసింది. అప్ప‌ట్నుంచి ఏ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చినా కూడా హ్యాపీడేస్ తో పోల్చి చూడ‌టం కామ‌న్ అయిపోయింది. ఇప్పుడు కూడా కిరాక్ పార్టీ ఇదే నేప‌థ్యంలో వ‌స్తుంది. ట్రైల‌ర్ చూస్తుంటే అచ్చంగా హ్యాపీడేస్ ప్ల‌స్ శివలు గుర్తొస్తున్నాయి. కాలేజ్ గొడ‌వ‌లు.. ప్రేమ‌లు.. స్నేహాలు అన్నీ ఇవే క‌నిపిస్తున్నాయి. దానికితోడు స‌డ‌న్ గా గ‌డ్డం పెంచేసుకుని నిఖిల్ కొత్త‌గా క‌నిపించాడు. ఇది ప్రేమ‌మ్ ను గుర్తు చేస్తుంది. 

క‌న్న‌డనాట గ‌తేడాది సంచ‌ల‌నం సృష్టించిన కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ ఇది. అక్క‌డ ఏడాది ఆడేసింది ఈ చిత్రం. ఇందులో ఏం ఉందో తెలియ‌దు కానీ ఇప్పుడు ఈ పేరు మాత్రం సౌత్ ఇండియా మొత్తాన్ని ఊపేస్తుంది. క‌థ న‌చ్చి.. ఆ కిక్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఇవ్వాల‌ని వ‌చ్చేస్తున్నాడు నిఖిల్. ఇక్క‌డ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీగా రీమేక్ చేస్తున్నాడు కొత్త ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. ఈ చిత్రానికి డైలాగులు చందూ మొండేటి రాయ‌గా.. స్క్రీన్ ప్లే బాధ్య‌త‌ను సుధీర్ వ‌ర్మ తీసుకున్నాడు. ఈ ఇద్ద‌రూ ద‌ర్శ‌కుల నుంచి ఔట్ పుట్ తీసుకుని కిరాక్ పార్టీ తెర‌కెక్కించాడు శ‌ర‌ణ్. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా నిఖిల్ సూప‌ర్ ఫామ్ సినిమాకు క‌లిసిరానుంది. ఈ చిత్రం మార్చ్ 16న విడుద‌ల కానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో 15 కోట్లు ట‌చ్ చేసింది కిరాక్ పార్టీ. నిఖిల్ కెరీర్ లోనే తొలిసారి 15 కోట్ల మార్క్ అందుకున్న సినిమా కిరాక్ పార్టీ. ఈ చిత్రం వ‌స్తోన్న తీరు జోరు చూస్తుంటే క‌చ్చితంగా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవ‌డం ఖాయ‌మైపోయింది. మ‌రి చూడాలిక‌.. కిరాక్ కుర్రాళ్లు ఏమేం చేయ‌బోతున్నారో..?

More Related Stories