English   

నొప్పిలేకుండా చనిపోవడం ఎలా..గూగుల్ చేసిన సుశాంత్

Sushant Singh Rajput
2020-08-04 10:02:13

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై ముంబై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసు విషయమ్లో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ వాడిన సిమ్ కార్డులు ఆయన పేరు మీద లేనట్లు ఇప్పటికే గుర్తించగా ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని పోలీసులు వెల్లడించారు. నొప్పిలేకుండా చనిపోవడం ఎలాగో సుశాంత్ గూగుల్ లో శోధించాడని ముంబయి పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ వెల్లడించారు. అంత కాక చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సుశాంత్ ఫోన్ లో తన పేరును సెర్చ్ చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

అంతేకాక ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుండీ ఆత్మహత్య చేసుకున్న తన మాజీ మేనేజర్ అయిన దిశ పేరును గూగుల్ లో సెర్స్ చేసేవాడని చెబుతున్నారు. ఆమె ఆత్మహత్య విషయంలో సుశాంత్ కు సంబంధం ఉంది అన్నట్లు మీడియాలో కధనాలు రావడంతో పాటు పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేయడం వల్ల సుశాంత్ భయంతో డిప్రెషన్ కు గురై ఉంటాడని ఆయన చెబుతున్నారు. డిప్రెషన్ నుండి ఎలా బయట పడాలి అనే విషయాన్ని కూడా ఆయన సెర్చ్ చేసినట్టు చెబుతున్నారు. అలానే సుశాంత్ ఆత్మహత్య ఘటన దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన చెబుతున్నారు. ఇక ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు ముమ్మురం చేసింది. 

More Related Stories