English   

 కోన వెంకట్ కొత్తది మొదలుపెట్టాడు

kona-venkat

ఒకప్పుడు స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలిగాడు కోన వెంకట్. ఒకే తరహా కథలతో కొన్నాళ్లు దూకుడు చూపించినా తర్వాత దర్శకుడు శ్రీను వైట్లతో విభేదాలతో వేరైపోయాడు.ఆ తర్వాత అతను కొత్త తరహా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఔత్సాహిక రచయితల నుంచి కథలు కొనడం వాటిని ఇతరులకు అమ్మడం వంటి బిజినెస్ కూడా చేశాడని చెబుతారు. కట్ చేస్తే ప్రొడక్షన్ లోకీ దిగాడు. ఆ మధ్య నాని హీరోగా వచ్చిన నిన్నుకోరి ప్రొడక్షన్ లో మనోడి చెక్కులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆ నిన్నుకోరి నిర్మాతలతో టైఅప్ అయ్యాడు కోన.. నిన్నుకోరి సినిమాలో కీలక పాత్రలో అదరగొట్టిన ఆది పినిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతను గతంలో గుండెల్లో గోదారి సినిమాలో నటించిన తాప్సీ హీరోయిన్. మరో హీరోయిన్ గా గురు ఫేమ్ రితికా సింగ్ నటిస్తోంది. రంగస్థలం తర్వాత ఆది పినిశెట్టి ఇకపై క్యారెక్టర్స్ చేయను అన్నాడు. కాకపోతే మళ్లీ అది రంగస్థలం స్థాయి పాత్రయితే చేస్తాను అన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడతనికి తెలుగులో వరుసగా అవకశాలు వస్తున్నాయి. దీంతో హీరోగా దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేస్తున్నదే ఈ సినిమా. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎమ్.వి.వి. బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ టైటిల్ ను ఈ నెల 24న నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఉదయం 11.11గంటలకు విడుదల చేయబోతున్నారు.. అదీ మేటర్ .. 

More Related Stories