English   

కోన భుజాలు తడుముకుంటున్నాడెందుకు..?

Kona-Venkat
2018-04-12 15:37:37

టాలీవుడ్ శ్రీ లీక్స్ తో షేక్ అవుతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియక టెన్షన్ లో ఉన్నారు చాలామంది ‘శ్రీ బాధితులు’. ఆ శ్రీ అప్పుడు ఇచ్చిన ఆనందం ఇప్పుడెందరికో నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే చాలామంది సినీ పర్సనాలిటీస్ పై ఎవిడెన్స్ తో సహా ఆరోపణలు చేస్తోంది శ్రీ రెడ్డి. అయితే దీనిపై గవర్నమెంట్ ఎంక్వైరీ వేయాలంటూ కోన వెంకట్ పెట్టిన ట్వీట్ మరో సెన్షేషన్ అవుతోంది. ఇన్నాళ్లూ కామ్ గా ఉన్న ఈ స్టార్ రైటర్ సడెన్ గా రియాక్ట్ కావడానికి కారణం.. ఆ లీక్స్ లో తనూ ఉండటమే. ఆ విషయాన్ని డైరెక్ట్ గా ఖండించకుండా శ్రీ రెడ్డిపై ప్రభుత్వ విచారణ చేయాలంటూ చెబుతున్నాడు. కోన చెప్పిన దాన్ని బట్టి చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. ఆయన సినిమా వారిని టార్గెట్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందంటూ చెప్పాడు. మరి ఇన్నాళ్లూ ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదీ కోన. తన వరకూ వచ్చేసరికి ఉలిక్కిపడ్డాడా.. లేక నిజంగానే తను ఆమె లిస్ట్ లో లేడా.,.? లేడంటే ఈ వాట్సాప్ వ్యవహారం ఎందుకు ఇలా అవుతోంది. 

రీసెంట్ గా కోనకూ తనకూ ఉన్న రిలేషన్ ను తెలియజేస్తూ వాట్సాప్ స్నాప్ చాట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఆ విషయం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కోన బుద్ధిమంతుడు అనుకున్నవాళ్లు ఆశ్చర్యపోయారు.. ఆయన గురించి తెలిసిన వాళ్లు కామ్ గా ఉన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణను ఖండించకుండా కోన వెంకట్ డిఫరెంట్ ట్వీట్స్ చేయడం ఆశ్చర్యంతో పాటు అనుమానాల్ని కలిగిస్తోంది. అర్థం లేని ఆరోపణలు అని కొట్టిపడేయొచ్చు. లేదా అవాస్తవం అనేయొచ్చు. అలా అనకుండా ఈ విషయంపై తెలంగాణ గవర్నమెంట్ జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయాలనడం మాత్రం కాస్త హాస్యాస్పదంగానే ఉంది. ఇప్పటి వరకూ ఇండస్ట్రీపై ఆమె ఎందరిపైనో ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రమే ఇండస్ట్రీ గుర్తొచ్చినట్టు.. పరిశ్రమ అందరీక సాఫ్ట్ కార్నర్ అయిపోతోందని చెప్పడం మాత్రం విడ్డూరంగానే ఉంది. ఏదేమైనా కోన ఈ వ్యవహారంలో ఉన్నాడా లేదా అనేది పక్కన బెడితే.. ఇప్పటికే శ్రీ రెడ్డి నేషనల్ న్యూస్ గా మారింది. ఇకనైనా ఇండస్ట్రీ అంతా కలిసి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడమో లేదంటే ‘ఇంకేదైనా’సొల్యూషన్ చూసుకోవడమో బెటర్.. 

More Related Stories