English   

కోన వెంకట్ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడు.. 

 Kona Venkat
2020-03-25 16:46:50

టాలీవుడ్ లో ఒకప్పుడు త్రివిక్రమ్ తర్వాత రైటర్స్ కు అంతగా క్రేజ్ తీసుకొచ్చింది కోన వెంకట్. మూడేళ్ల కింది వరకు ఈయన ఏం చెప్తే అదే నడిచేది. స్టార్ హీరోలు కూడా ఈయన కథల కోసం చూసేవాళ్లు. ముఖ్యంగా శ్రీనువైట్లతో ఉన్నపుడు ఈయన రేంజ్ మరోలా ఉండేది. అక్కడ్నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తనను తాను నిరూపించుకున్నాడు కోన. వరస విజయాలతో సంచలనాలు సృష్టించాడు కూడా. గీతాంజలి, నిన్నుకోరి, జై లవకుశ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసాడు. అలాంటి రైటర్ తన జీవితంలో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం తాజాగా అలీతో సరదాగా షోలో బయటపెట్టాడు కోన వెంకట్. 

తన జీవితంలో కష్టాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పాడు ఈయన. అప్పుడెప్పుడో ధర్మవరపు సుబ్రమణ్యం తెరకెక్కించిన తోక లేని పిట్ట సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చిన కోన.. ఆ తర్వాత రైటర్, డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ ఇలా చాలా అయిపోయాడు. ఇప్పుడు నిర్మాతగా నిశ్శబ్ధం సినిమాను తీసాడు. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్స్ కోసమే అలీ ప్రోగ్రామ్ కు వచ్చాడు ఈయన. అందులోనే తన సూసైడ్ ప్రయత్నం గురించి చెప్పుకొచ్చాడు. ఓ సందర్భంలో సింగిల్ రూమ్ లో.. అది కూడా రేకుల షెడ్డులో ఉంటూ పిల్లలకు కనీసం స్కూల్ ఫీజులు కూడా కట్టలేని సందర్భంలో.. 50 నిద్రమాత్రలు వేసుకుందామని అనుకున్నట్లు చెప్పాడు కోన వెంకట్. చనిపోదామనుకున్నానని కానీ తర్వాత కుటుంబం కోసం నిర్ణయం మార్చుకున్నట్లు సంచలన విషయం చెప్పాడు కోన. ఇంకా ఈ షోలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు కోన వెంకట్. 

More Related Stories