English   

తెర మీదకి మరో బయోపిక్

bio
2020-02-17 06:53:31

ప్రస్తుతం ఇండియాలో అన్ని బాషలలో హిట్ అవుతున్న ఏకైక జానర్ బయోపిక్. ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో  బయోపిక్‌ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అందునా క్రీడాకారుల బయోపిక్స్ కి ఇంకా క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం లేడీ క్రికేర్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్‌, షట్లర్ సైనా నెహ్వాల్‌, పి.వి సింధు, కపిల్‌ దేవ్, గోపీచంద్‌ వంటి దిగ్గజ క్రీడాకారుల జీవితాలని సినిమాలుగా మలుస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బయిపిక్ కూడా చేరుంది. ప్రముఖ రచయిత అనుష్క లీడ్ రోల్ లో నిశ్శబ్దం అనే సినిమా తెరకెక్కిస్తున్న నిర్మాత కోన వెంకట్‌ మల్లీశ్వరి జీవితగాథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. తాజాగా ఆయన మల్లేశ్వరిని కలిసి హక్కులు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని పాన్‌ ఇండియన్ మూవీగా విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.  శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన కరణం మల్లీశ్వరి చిన్నతనం నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కోని వెయిట్‌ లిఫ్టర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎన్నో జాతీయ.. అంతర్జాతీయ బహుమతులు గెలుచుకోవడమే కాక.. 2000 ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని ఏ దర్శకుడు తెరకేక్కిస్తారనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

 

More Related Stories