English   

“కొండా” చిత్రం ప్రారంభం

konda-shooting-started
2021-10-13 05:17:58

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకం పై మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలు గా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నిర్మించబడుతున్నచిత్రం “కొండా”. వరంగల్ లోని కొండా మురళి మరియు కొండా సురేఖ గార్ల జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్న చిత్రం “కొండా”. . ఈ చిత్రం వరంగల్ లో కొండా మురళి సొంతఊరు వంచనగిరి లో ఘనంగా ప్రారంభం అయింది. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయం లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. వరంగల్ ప్రజలు ఈ చిత్రం ఓపెనింగ్ కి తండోపతండాలుగా విచ్చేసి హర్షద్వానాలతో ముహూర్తపు సన్నివేశాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. విజయవాడ లో చదువుకున్నాను, ఆంధ్ర లో జరిగిన చరిత్ర అంత తెలుసు కానీ తెలంగాణ చరిత్ర అంతగా తెలీదు. కొండా మురళి గారి చరిత్ర చాలా గొప్పగా నచ్చింది. వాళ్ళ జీవిత కథని అందరికి తెలియాలి అని కొండా చిత్రాని నిర్మిస్తున్నాము. కొండా మురళి మామూలు మనిషి కాదు అని చాలా చెప్పారు. ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్తుతులలో పుడతారు. ఎవరేం చేసిన పుట్టిన పరిస్థితి ,పెరిగిన పరిస్థితి అన్నీ కలిసి ఒక కలెక్టివ్ మైండ్ మీద ఎఫెక్ట్ ఇచ్చి అప్పుడు వారి కున్న ధైర్యం తో మంచి కోసం, న్యాయం కోసం ఎదురు తిరిగే దమ్ము చాలా తక్కువ మందికి ఉండగా మిగిలిన వారంతా కూడా బానిసలుగా వుంటారు. నేను వీరి కథ, జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత మహా దమ్మున్నోడు కొండ మురళి అని నేను తెలుసుకున్నాను.

నేను ఒక ఫిల్మ్ మేకర్ ని ఎవరో జీవించిన వ్యక్తి గురించి నేను కొంతమంది ద్వారా తెలుసుకొని దాంట్లో నుంచి నాకు అర్థం అయిన సారాంశాన్ని తీయడం జరుగుతుంది. నాకు ఒక కొండ మురళి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏ డైరెక్టర్ కైనా తన కథ ఎంత ఫెంటాస్టిక్ ఉందనేది ముఖ్యం. కథ బాగా లేకపోతే ఏమి చేయలేడు.నేను శివ నుంచి స్టార్ట్ అయ్యి బాంబే నుంచి తీసిన సినిమాల నుంచి కావచ్చు నా సినీ చరిత్రలో విన్న మోస్ట్ ఎక్స్ట్రార్డినరీ కథ కొండా . కొండా మురళి, కొండా సురేఖ గార్ల కథను నేను నా టాలెంట్ తో వారి జీవిత చరిత్ర ను టెన్ పర్సెంట్ సినిమాలో పెట్ట గలిగినా కూడా నా ప్రయత్నం సక్సెస్ అయి కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. కొండ మురళి తో కలిసి నేను తిరిగిన తర్వాత నేను సురేఖమ్మ గారి కంటే మురళిని ఎక్కువ ఇష్టపడుతున్నాను. నేను చూసిన అందరిలో కంటే వీరు బెస్ట్ కపుల్స్. కొండ గారి కపుల్స్ ది చాలా యూనిక్ థింగ్ ఇలాంటి రిలేషన్ షిప్ తో ఉన్న ఫ్యామిలీ నేను ఇప్పటి వరకు చూడలేదు.అందుకే వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. కొండా అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాకూడదని యూనివర్సల్ కావాలని ఈ సినిమా తీస్తున్నాను. కొండా లాంటి సినిమా ఇప్పటివరకు మీరు లైఫ్ లో చూసి ఉండరని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నారు.

More Related Stories