English   

అమ్మో.. ఈ అమ్మాయి ఉపాస‌నేనా..? 

Upasana-Clean-Week
2018-02-13 12:40:50

ఏమో ఇప్పుడు అంద‌రికీ ఇదే అనుమానం వ‌స్తుంది. ఒక‌ప్పుడు ఉపాస‌న‌ను చూసి అంతా విమ‌ర్శించారు. రామ్ చ‌ర‌ణ్ ఏంటి.. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడ‌ని వెక్కిరించిన వాళ్లు కూడా లేక‌పోలేరు. కానీ ఇప్పుడు ఆ విమ‌ర్శించిన నోళ్ళ‌తోనే ప్ర‌శంస‌లు వ‌చ్చేలా చేసుకుంటుంది ఉపాస‌న. ఈ మెగా కోడ‌లి మేకోవ‌ర్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లు మ‌నం చూసిన ఉపాస‌నేనా లేదంటే ఏదైనా మాయ చేసింది అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఈ ఫ్యామిలీ నుంచి నిహారిక మాత్ర‌మే హీరోయిన్. కానీ ఇప్పుడు ఉపాస‌న కూడా మ‌రో హీరోయిన్ రేంజ్ లో మారిపోయింది. ఈమె త‌న ఫిజిక్ కోసం చాలా అంటే చాలా క‌ష్ట‌ప‌డింది కూడా. ముఖ్యంగా ఫుడ్ విష‌యంలో ఎక్క‌డ‌లేని జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంది. ఓ వారం పాటు అన్నం అనేదే లేకుండా ఉంది. కేవ‌లం ప‌చ్చి కూర‌గాయ‌లు.. ఆకుకూర‌లు.. క్యారెట్లు.. బీట్ రూట్ లాంటివ‌న్నీ తిన్న‌ది. రెండేళ్లుగా ఈ భామ పూర్తిగా ఫిట్ నెస్ ఫ్రీక్ అయిపోయింది. దాని ఫ‌లిత‌మే ఇప్పుడు క‌నిపిస్తున్న ఉపాస‌న‌. ఓ వైపు రామ్ చ‌ర‌ణ్ కూడా సినిమా సినిమాకు కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. భ‌ర్తను చూసి ఉపాస‌న కూడా ఇన్ స్పైర్ అవుతుందేమో కానీ హీరోయిన్ కూడా కుళ్లుకునేలా మారిపోయింది ఈ కామినేని వార‌మ్మాయి. మొత్తానికి ఈ అమ్మాయి కొత్త రూపం ఇప్పుడు మెగాభిమానుల‌కు అయితే అనూహ్య‌మైన షాక్. 

More Related Stories