English   

చిరంజీవితో కొరటాల కన్ఫార్మేనా..?

chiru-koratala
2018-05-22 11:54:45

మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ కొరటాల కాంబినేషన్ లో సినిమా దాదాపు కన్ఫార్మ్ అయినట్టే అంటున్నారు. నిజానికి ఖైదీ నెంబర్ 150 టైమ్ లో కూడా కొరటాల పేరు వినిపించింది. కానీ కమ్ బ్యాక్ మూవీ కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండాలని కొరటాలను సైడ్ చేశారు. ఈ లోగా కొరటాల జనతా గ్యారేజ్, భరత్ అనేనేను అంటూ మరో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. దీంతో మరోసారి కొరటాల, చిరంజీవి కాంబినేషన్ తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఈ కథకు సంబంధించిన చర్చల్లో కొరటాల ఉన్నాడంటున్నారు. ఆ స్టోరీ నచ్చితే కనుక ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుంది.  నిజానికి చిరంజీవి దర్శకులను తక్కువగానే నమ్ముతారు. కథకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అనేది అందరికీ తెలుసు. ఒకవేళ దర్శకుడిని నమ్మినా.. కథ విషయంలో తనదైన శైలిలో ఇంప్రూవ్ మెంట్స్ లేదంటే ఇన్వాల్వ్ మెంట్ తీసుకుంటారు. ఆ ఛాన్స్ కొరటాల చిరంజీవికి ఇస్తాడా అనేది వేరే విషయం. అయితే స్టోరీ నచ్చకపోతే మాత్రం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు. అంత వరకూ గ్యారెంటీ. మరోవైపు కొరటాల, నాని కాంబినేషన్ లో సినిమా అనేది కూడా బలంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ నుంచి అక్టోబర్ వరకూ కాస్త రిలీఫ్ అవుతాడు. ఆ టైమ్ వరకూ కొరటాల చిరంజీవికి నచ్చే కథ రెడీ చేసుకుంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అఫీషియల్ న్యూస్ వస్తుంది. లేదంటే అంతే సంగతులు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కాకపోయినా కొరటాల అటు నాని, ఇటు అఖిల్ లను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకే కాదు ఆడియన్స్ కు కూడా అదిరిపోయే ఫీస్ట్ అవుతుందేమో.

More Related Stories