English   

బన్నీ కొరటాల సినిమాపై కీలక అప్డేట్

Koratala Siva Allu Arjun
2021-02-20 14:15:30

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రశ్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అడవుల నేపథ్యంలో తెరకెక్కితున్న కారణంగా ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ను అడవుల్లోనే చిత్రిస్తున్నారు. దాంతో ఇంతకాలం షూటింగ్ ను తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో చిత్రించారు. అయితే సెట్స్ లో యూనిట్ సభ్యుడు ఒకరు కరోనాతో మరణించారు. 

దాంతో సుకుమార్ ఈ సారి రిస్క్ చేయకుండా హైదరాబాద్ లోనే సెట్ వేసి షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతునట్టు ప్రకటించేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలెట్టారు. ప్రొడక్షన్ హౌస్ కోసం కొత్త ఆఫీస్ ను కూడా తెరవబోతునట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పుష్ప పూర్తవగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

More Related Stories