English   

కొర‌టాల కాంప్రమైజ్ అయిపోయాడా..?

Koratala-Siva

ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించేలా తీసాడు కొర‌టాల శివ‌. ఇది మామూలు విష‌యం కాదు. ప్ర‌తీ సినిమాతోనూ అటు నిర్మాత‌ల‌కు.. ఇటు బ‌య్య‌ర్ల‌కు లాభాలు తీసుకొస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న తాజా భ‌ర‌త్ అనే నేను మాత్రం ఇంకా సేఫ్ జోన్ కు రాలేదు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వారాల్లో 89 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇంకా 11 కోట్లు వ‌స్తే త‌ప్ప భ‌ర‌త్ సేఫ్ కాదు. చివ‌రి వ‌ర‌కు అది వ‌స్తుందో లేదో చూడాలి. కానీ ఇప్పుడు మాత్రం కొర‌టాల‌కు డిమాండ్ మామూలుగా లేదు. ఈయ‌న కూడా ఇక‌పై క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తానంటున్నాడు కానీ అందులో సందేశం ఇవ్వ‌నంటున్నాడు. వ‌ర‌స‌గా మెసేజ్ లు ఇచ్చి తాను కూడా బోర్ అవుతున్నాన‌ని.. అందుకే ఈ సారి కొత్త‌గా ప్రేమ‌క‌థ రాస్తున్నాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ ల‌వ్ స్టోరీ అఖిల్ కోస‌మే అని తెలుస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అఖిల్ తో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈయ‌న రెండు సినిమాలు ఫ్లాపులే. ఇప్పుడు వెంకీ అట్లూరీతో సినిమా చేస్తున్నాడు అక్కినేని వార‌సుడు. దీని త‌ర్వాత కొర‌టాల సినిమా ఉండే అవ‌కాశం ఉంది. దీనికోసం కొర‌టాల‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ముట్టింద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే కొర‌టాల క‌థ సిద్ధం చేసే ప‌నిమీద ఉన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిర్తే ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి అఖిల్-కొర‌టాల సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి రెమ్యున‌రేష‌న్ కోసం కొర‌టాల కాంప్ర‌మైజ్ అవుతున్నాడా లేదంటే నాగార్జున అడిగాడ‌ని కాంప్ర‌మైజ్ అవుతున్నాడా అనేది చూడాలిక‌..!
 

More Related Stories