English   

 కొర‌టాల కోరిక చెప్పిన మ‌హేశ్.. 

koratala-siva
2018-05-01 13:20:02

భ‌ర‌త్ అనే నేను చూసిన‌పుడే కొర‌టాల శివ‌కు రాజ‌కీయాలంటే ఎంత ఇష్ట‌మో అర్థ‌మైపోయింది. ఇక దానికంటే ముందు కూడా రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు రాజ‌కీయాలు కుళ్లిపోయాయ‌ని.. ఎవ‌రికి వాళ్ళు దిగి స్వ‌చ్చందంగా క్లీన్ చేస్తే త‌ప్ప అవి బాగుప‌డ‌వ‌ని ఆ మ‌ధ్య సంచ‌ల‌న క‌మెంట్స్ చేసాడు కొర‌టాల శివ‌. ఇక ప్ర‌త్యేక హోదాపై కూడా ఇచ్చిన మాట నిల‌బెట్టుకుని మోడి మ‌గాడు అనిపించుకోవాలంటూ ఆ మ‌ధ్య ట్వీటేసాడు. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత కేవ‌లం ఈయ‌న‌లో ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఉన్నాడ‌ని అర్థ‌మైపోయింది. అయితే ఇదంతా భ‌ర‌త్ అనే నేను ప్ర‌మోష‌న్ కోసం చేస్తున్నాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంది ఈయ‌న‌లో రాజ‌కీయాల్లోకి రావాల‌న్న కోరిక బ‌లంగా ఉంద‌ని. ఈ విష‌యాన్ని చెప్పింది కూడా మ‌హేశ్ బాబే. 

ఈయ‌న‌కు ఇప్పుడు కాక‌పోయినా లైఫ్ లో ఎప్పుడో ఓసారి క‌చ్చితంగా పాలిటిక్స్ లోకి రావాల‌ని.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వాల‌ని కోరిక ఉంద‌న్నాడు మ‌హేశ్. దీనిపై కొర‌టాల కూడా పాజిటివ్ గానే స్పందించాడు. త‌న‌కు రాజ‌కీయాలంటే బాగా ఇష్ట‌మ‌ని.. ఆస‌క్తి అని.. ఫ్యూచ‌ర్ లో రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పాడు కొర‌టాల‌. అయితే ఇప్పుడు మాత్రం త‌న దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంద‌న్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌ర్వాతి సినిమా ఏంటో ఇప్పుడే చెప్ప‌లేన‌ని.. అది మాత్రం పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఉంటే బ‌న్నీతోనే ఈ ద‌ర్శ‌కుడి సినిమా ఉంటుంద‌ని వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొర‌టాల కోసం ఖాళీగా ఏ స్టార్ హీరో కూడా లేడిప్పుడు. అంతా త‌మ‌త‌మ సినిమాల‌తో ఏళ్ల‌కేళ్లు బిజీగా ఉన్నారు. మొత్తానికి చూడాలిక‌.. కొర‌టాల త‌న కోరిక‌ను ఎప్ప‌టికి తీర్చుకుంటాడో..?
 

More Related Stories