English   

 శ్రీ రెడ్డి పై కొరటాల శివ ఓపెన్ అయ్యాడు

Koratala-Siva

ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ఏకైక పేరు శ్రీ రెడ్డి. హద్దులు దాటిన మాటలు, స్థాయికి మించిన కమెంట్స్ తో ఆమె చేస్తోన్న రచ్చకు ఇండస్ట్రీ అంతా కొంతకాలంగా డిస్ట్రబ్ అవుతోందనేది అందరికీ తెలుసు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ పై చేసిన కమెంట్స్ తో ఆమె స్థాయి ఎంత దిగజారిందో కూడా తెలుసు. అయితే ఈమెకు సపోర్ట్ గా వస్తోన్న ఆర్టిస్టుల్లో ఎవరూ కరెక్ట్ గా తెలిసిన మొహాలు కూడా లేరు. వాళ్లు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే కామెడీ ఉంటోంది కూడా. ఇక వీరికి తోడు కొన్ని మహిళా సంఘాలు కూడా శ్రీరెడ్డికి బాసటగా నిలిచాయి. కొంత వరకూ బేరబుల్ గా ఉన్న శ్రీరెడ్డి కొన్నాళ్లుగా హద్దులు దాటింది. దిగజారుడుతనానికి పరాకాస్టగా మారిన శ్రీరెడ్డి చేసిన కంప్లైంట్స్ లో స్టార్ డైరెక్టర్  కొరటాల శివ కూడా ఉన్నాడు. ఇన్నాళ్లూ కామ్ గా ఉన్న కొరటాల శివ మొదటిసారిగా ఈ విషయంపై వీడియో బైట్ విడుదల చేశాడు. తనలైఫ్ లో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తాను అన్నాడు. తన చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లే పెంచిన వాడిని, తర్వాత భార్యే తన లోకమనీ, వివేకానంద ఫాలోవర్ గా ఉన్న తాను ఎప్పుడూ మహిళలను గౌరవిస్తానని చెప్పాడు. అయితే ఇప్పటి త్వరలోనే తన సినిమా  భరత్ అనేనేను రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూస్ కు ఇచ్చే టైమ్ లో ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ముందే క్లారిటీ ఇస్తే కాస్త శాంతంగా ఉంటాననే ఫీలింగ్ తోనే ఈ వీడియో చేశానని చెప్పాడు. అయితే మొన్నటి వరకూ అంటే ఏం జరిగేదో కానీ.. ఇక శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన కమెంట్స్ తర్వాత.. ఇప్పటి వరకూ తనను సపోర్ట్ చేసిన వారు కూడా డ్రాప్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొరటాల వీడియోకు విపరీతమైన పాజిటివ్ కమెంట్స్ వస్తుండటం విశేషం. ఈ మొత్తంగా వీడియోలో గొప్ప విషయం ఏంటంటే.. కొరటాల ఎక్కడా శ్రీ రెడ్డి పేరు చెప్పలేదు. అలాగే ఆమె కూడా తన పేరు డైరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదేమో అనిపించింది అన్నాడు. నిజమే.. పేరు లేనంత మాత్రం ఆయన పేరు రాకుండా పోలేదు కదా.. ఒకరకంగా కొరటాల ఇలా ముందే చెప్పి మంచి పనేచేశాడు. లేదంటే కొన్నిసార్లు మౌనం అర్థాంగీకారంగా మారే ప్రమాదమూ ఉంది.. 

More Related Stories