English   

కొరటాలతో అఖిల్ కన్ఫార్మ్..?

koratalasiva and akhil
2018-02-23 19:49:37

కొరటాల శివ.. ఫుల్ స్వింగ్ లో ఉన్న దర్శకుడు. చేస్తోన్న ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతూ అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో రెండోసారి సినిమా చేస్తున్నాడు. శ్రీమంతుడుతో మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడు అతనితోనే భరత్ అనేనేను అనే పొలిటికల్ డ్రామా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కొరటాల శివ ఎవరితో చేస్తున్నాడు అనే ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడింది. ఎన్టీఆర్ నిర్మాతతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ. అయితే ఇందులో హీరో ఎన్టీఆర్ కాదు.

నిజానికి మహేష్ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది.ఆ సినిమాకు సుధాకర్ అనే నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ లోగానే యంగ్ టైగర్ రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ తో సినిమా మార్చిలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడు. దీంతో కొరటాలతో సినిమా 2019 వేసవి తర్వాత కానీ సాధ్యం కాదు. కానీ కొరటాల ఇప్పుడు చేస్తోన్న భరత్ అనే నేనుకు సంబంధించి మరో రెండు నెలల్లో ఖాళీ అయిపోతాడు. అప్పుడు ఎన్టీఆర్ కోసం యేడాదికిపైగా వెయిట్ చేయలేడు కదా.. అందుకే అతని కోసం చాలామంది హీరోలు ట్రై చేస్తోన్నా ఫైనల్ గా అక్కినేని కుర్రాడికి ఆ ఛాన్స్ వచ్చినట్టే చెబుతున్నారు.

అక్కినేని అఖిల్.. చేసిన రెండు సినిమాల్లో ఫస్ట్ మూవీ డిజాస్టర్. హలో కాస్త ఫర్వాలేదనుకున్నా లాభాలు తేలేకపోయింది. దీంతో కుర్రాడు కాస్త డిజప్పాయింట్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నాగ్ చేసిన మంత్రాంగం ఫలించినట్టే చెబుతున్నారు. దీంతో అఖిల్ తో సినిమా చేయడానికి కొరటాల ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నిర్మాత సుధాకర్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. మహేష్ బాబుతో సినిమా విడుదల కాగానే కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు శివ. అయితే అఖిల్ గత రెండు సినిమాలకు, కొరటాల ప్రీవియస్ మూవీస్ కు భిన్నంగా ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ లో రూపొందించబోతున్నారని టాక్. అంటే బడ్జెట్ తేలిందంటే కథ కూడా ఫైనల్ అయినట్టే కదా.. మరి  కొరటాల శివ సినిమాతో అయినా అఖిల్ ఫేట్ మారుతుందేమో చూడాలి.

More Related Stories