English   

కోట శ్రీనివాసరావు అప్పుడు అన్నదే నిజమయిందా..

 Kota Srinivasa Rao
2020-02-24 11:58:56

కోట శ్రీనివాసరావు అనే పేరు విన‌గానే గొప్ప న‌టుడితో పాటు ఎక్కువగా వివాదాలే గుర్తువస్తాయి. ఎందుకో కానీ కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు. అయితే ఈ ఈ మ‌ధ్య అస‌లు కోట సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. క‌నీసం ఈయ‌న‌కు అవ‌కాశాలు కూడా ఇవ్వ‌డం లేదు ద‌ర్శ‌కులు. 

సరిగ్గా ఏడాది క్రితం వచ్చిన మహర్షిలో ఒక్క సీన్ లో కనిపించి మాయమయిన ఆయన మళ్ళీ ఇప్పటిదాకా తెర మీద కనిపించలేదు. గ‌త 30 ఏళ్లుగా రోజుకు 20 గంట‌లు ప‌ని చేస్తూ వ‌చ్చిన ఈయ‌న‌ ఇప్పుడు ఖాళీగా ఉండ‌టం అస్స‌లు న‌చ్చ‌డం లేదట. ఇదే విష‌యాన్ని గతంలో మీడియా ముందు వచ్చి కూడా చెప్పాడు. త‌న‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో.. అస‌లెందుకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదో త‌న‌కు కూడా అర్థం కావ‌డం లేదని ఆయన చెబుతున్నారు. 

వ‌య‌సు అయిపోయింద‌ని ఇక న‌డ‌వ‌లేడ‌ని ముందే నిర్ణ‌యించుకుని త‌న‌ను ప‌క్క‌న‌బెట్టేసారేమో అని కూడా ఆయన ఆ సభలో చెప్పుకొచ్చాడు. ఆయన అప్పుడు చెప్పినట్టుగానే ఆయన పరిస్థితి ఇప్పుడు కదలలేనంత దారుణంగా ఉందని అంటున్నారు. అందుకే సినిమాలు కూడా ఎవరూ ఇవ్వడంలేదని అంటన్నారు.  

More Related Stories