English   

రవితేజ క్రాక్ 15 డేస్ కలెక్షన్స్

 Krack
2021-01-25 17:54:42

రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ కాలం నుండి సరైన మాస్ సినిమా చూడకుండా ఆకలితో ఉన్న ప్రేక్షకులకు క్రాక్ మాస్ బిర్యానిని వడ్డించింది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో హాట్రిక్ హిట్ కూడా కొట్టారు. సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ రొమాన్స్ చేసింది.  సినిమాను సరస్వతి ఫిల్మ్ బ్యానర్ పై బి.మధు నిర్మించారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇదిలా ఉండగా ఈ సినిమా  ఇప్పటికీ మాస్ వసూళ్ళు రాబడుతోంది. క్రాక్ పదిహేను రోజుల వసూళ్లు చూసుకుంటే..మొత్తం 33.12కోట్ల షేర్ ను రాబట్టింది. ఏపీ తెలంగాణలో 30.83 కోట్ల వసూళ్లు రబట్టింది. కేవలం 50శాతం సీటింగ్ పరిమితిలో ఈ రేంజ్ లో వసూళ్లు రబట్టడం అంత సులభం కాదు. ఈ సినిమాను కొన్న బయ్యర్లు ఇప్పటికే 14 కోట్ల పైగా లాభాలను దక్కించుకున్నారు. మూడేళ్ళుగా సరైన హిట్ లేక బాధపడుతున్న రవితేజ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా బడా ఆఫర్లు వస్తున్నాయి.

More Related Stories