English   

క్రాక్ 10 డేస్ కలెక్షన్స్..మోత మోగించిన మాస్ మహారాజ్

Krack
2021-01-21 12:06:07

సంక్రాంతి బరిలో నిలిచిన "క్రాక్" సినిమా ప్రేక్షకులకు మాస్ బిర్యానీ వడ్డించింది. చాలా కాలం తరవాత థియేటర్ లోకి మాస్ సినిమా రావడంతో థియేటర్ లు హౌస్ ఫుల్ అవుతన్నాయి. దాంతో 50 శాతం సీటింగ్ సామర్థ్యం లోను "క్రాక్" వసూళ్ల వర్షం కురిపిస్తోంది . గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. సినిమా రిలీజ్ అయ్యి 10రోజులు కావస్తున్నా వసూళ్ల వర్షం కురుస్తుంది. ఈసినిమాను  సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై బి.మధు నిర్మించారు. 

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచింది. బలుపు, డాన్ శ్రీను సినిమాలతో రవితేజ కు హిట్ అందించిన సంగతి తెలిసిందే. ఇక క్రాక్ తో ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టారు. ఇక క్రాక్ 10రోజుల కలెక్షన్ ల వివరాలు చూసుకుంటే. క్రాక్ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ అయ్యింది. 10రోజులకు ఈ సినిమా 28.కోట్ల షేర్ ను రాబట్టింది. కాగా ఏపీ తెలంగాణ కలిపి మొత్తం 26. 38కోట్లు రాబట్టింది. ఈ సినిమాను కొన్న బయ్యర్లు ఇప్పటికే లాభాల బాటలో ఉన్నారు. నిన్న కూడా ఈ సినిమా కోటిపైగా షేర్ ను రాబట్టింది. 
 

More Related Stories