English   

ద‌ర్శ‌కులు ఏం దిగిపోయార‌బ్బా..!

Krish-as-kv-reddy
2018-05-07 17:28:05

అల‌నాటి ద‌ర్శ‌కుల‌ను మ‌ళ్లీ తెర‌పై చూపించ‌డం అనేది చిన్న విష‌యం కాదు. దానికి చాలా క‌స‌ర‌త్తులు చేయాలి. మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు కూడా దొర‌కాలి. ఇప్పుడు నాగ్ అశ్విన్ ఇదే చేసాడు. మ‌హాన‌టిలో త‌న‌కు కావాల్సిన వాళ్ల కోసం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కీర్తి సురేష్ విష‌యంలోనే ఈయ‌న త‌న‌కు కావాల్సింది సాధించుకున్నాడు. ఈమెను పూర్తిగా అభిన‌వ సావిత్రిగా మార్చేసాడు. ఇక ఇందులో ద‌ర్శ‌కులు కూడా ఇలాగే ఉన్నారు. అల‌నాటి కేవీ రెడ్డితో పాటు ఎల్వీ ప్ర‌సాద్, సింగీతం లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మ‌హాన‌టిలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. కేవీ రెడ్డిగా క్రిష్.. ఎల్వీ ప్ర‌సాద్ గా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అయితే అచ్చంగా దిగిపోయారు. అప్ప‌ట్లో వాళ్ల‌ను చూసిన వాళ్లు ఉన్నారో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు వీళ్ల‌ను చూస్తుంటే మాత్రం అప్పుడు వాళ్ల‌ను చూసిన‌ట్లే. అంత‌గా మాయ చేసాడు నాగ్ అశ్విన్. ఇక మోహ‌న్ బాబు కూడా ఎస్వీఆర్ కు ఏ  మాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు. వీళ్ళ‌తో పాటు మిగిలిన కారెక్ట‌ర్లు కూడా అంతే చ‌క్క‌గా డిజైన్ చేసాడు నాగ్ అశ్విన్. మ‌హాన‌టి విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ఖాయం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి వాళ్ల నమ్మ‌కాన్ని ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌..!
 

More Related Stories