English   

సైరా.. సురేంద‌ర్ ఔట్.. వంశీ ఇన్..

krishna vamsi
2018-03-05 19:30:52

ఇక్క‌డ వంశీ అంటే వంశీ పైడిప‌ల్లి కాదు.. కృష్ణ‌వంశీ. అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌లైతే ఇవే. మెగా యూనిట్ కూడా ఈ వార్త‌ల‌పై పెద్ద‌గా స్పందించ‌డం లేదు. సైరా సినిమాకు పేరుకు మాత్ర‌మే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు అని.. చూసుకుంటున్న‌దంతా కృష్ణ‌వంశీ అని తెలుస్తుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు విన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు కృష్ణ‌వంశీ. ఆయ‌న సినిమా అలా ఉండేవి మ‌రి. ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఓ సింధూరం.. గులాబి.. నిన్నే పెళ్లాడ‌తా.. మురారి.. ఖ‌డ్గం.. చంద‌మామ.. ఇలాంటి సినిమాలన్నీ తీసింది ఒకే ద‌ర్శ‌కుడు అంటే న‌మ్మ‌డం క‌ష్టం. ఎందుకంటే వేటిక‌వే డిఫెరెంట్ జోన‌ర్ లో ఉన్న సంచ‌ల‌నాత్మ‌క సినిమాలు. కెరీర్ మొద‌లుపెట్టిన కొన్నేళ్ల‌లోనే ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసాడు కృష్ణ‌వంశీ. కానీ గ‌త కొన్నేళ్లుగా ఈయ‌న ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఇప్పుడు పూర్తిగా ప‌థ‌న‌మ‌య్యే దిశ‌కు వ‌చ్చేసింది. ఈ స‌మ‌యంలో చిరంజీవి ఆయ‌న్ని న‌మ్ముతున్నాడు.

మెగాస్టార్ కు వందేమాత‌రం లాంటి ఇన్ స్పైరింగ్ క‌థ చెప్పి ఒప్పించిన కృష్ణ‌వంశీ.. అనుకోని కార‌ణాల‌తో ఆ సినిమాను తెర‌కెక్కించ‌లేక‌పోయాడు. కానీ కృష్ణ‌వంశీపై చిరుకు న‌మ్మకం మాత్రం అలాగే ఉంది ఇప్ప‌టికీ. అందుకే ఫామ్ లో లేడ‌ని తెలిసినా కూడా చ‌ర‌ణ్ తో గోవిందుడు అంద‌రివాడేలే లాంటి సినిమా చేసే అవ‌కాశం ఇచ్చాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఆయ‌న టెక్నిక‌ల్ బ్రిలియ‌న్స్ తెలిసి.. సైరాలోని కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు పాట‌ల‌ను కూడా కృష్ణ‌వంశీకే తీసే అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఇది పూర్తిగా మెగాస్టార్ ఇష్టం కావ‌డంతో ఎవ‌రూ మాట కూడా మాట్లాడ‌టం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చిరుతో సినిమా చేయ‌క‌పోయినా.. ఆయ‌న‌తో అప్ప‌ట్లో థ‌మ్సప్ యాడ్ చేసాడు వంశీ. అప్ప‌ట్నుంచే కృష్ణ‌వంశీపై మంచి ఇంప్రెష‌న్ ప‌డిపోయింది చిరంజీవికి. అదే ఇప్ప‌టికీ కొన‌సాగుతుంది కూడా. మొత్తానికి చూడాలిక‌.. సైరా ఎలా ఉండ‌బోతుందో మ‌రి.. ఈ క్రియేటివ్ ద‌ర్శ‌కుడి ముద్ర ప‌డిన త‌ర్వాత‌..!

More Related Stories