English   

కృష్ణార్జునయుద్దం సెన్సార్ కంప్లీట్

krishnarjuna-yuddham-censor

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’ సెన్సార్ పూర్తైంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. నాని కెరీర్ లో ఈ మూవీతో మూడోసారి డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. కృష్ణ, అర్జున్ అనే రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు నాని. ఈ రెండు పాత్రల సరసన అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ తోనే ఈ సినిమాపై హైప్స్ పెంచాడు నాని. ఆ తర్వాత ఒక్కో పాటతో అంచనాలు పెంచుకుంటూ వెళ్లిన టీమ్.. రీసెంట్ ట్రైలర్ తో ఒక్కసారిగా గేమ్ చేంజింగ్ మూవీ అనిపించాడు. తమిళ్ లేటెస్ట్ సెన్షేషన్ హిప్ హాప్ తమిళ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇకఈ మూవీతో ఈ మధ్య ఎఫ్పుడూ లేనంతగా యాక్షన్ కంటెంట్ తోనూ అలరించబోతున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో ఫైట్స్ కూడా చాలా మాసివ్ గా ఉన్నాయి. ఇక ఈ నెల 12న కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ వార్ లో దిగబోతోంది. వరస చూస్తోంటే నానికి ఈ సినిమా మరో మెమరబుల్ మూవీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. 
 

More Related Stories