English   

కృష్ణార్జున యుద్ధం.. కాస్త ఎక్కువైన‌ట్లుంది నాని..? 

Nani-Krishnarjuna-Yuddham

నాని సినిమా వ‌చ్చిందంటే ఇప్పుడు ఎలా ఉంది అని అడ‌గ‌డం కూడా మానేసారు ప్రేక్ష‌కులు. నాని సినిమానే క‌దా బాగుంటుందిలే అంటున్నారు. అలాంటి గోల్డెన్ టైమ్ ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ కు న‌డుస్తుంది టాలీవుడ్ లో. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఎనిమిది వ‌ర‌స విజ‌యాలు అంటే అంత చిన్న విష‌యం కాదు. చాలా మంది హీరోల‌కు క‌ల్లో కూడా రాని విజ‌యాలు అవి. అలాంటిది ఇప్పుడు నానికి వ‌చ్చాయి. ఎనిమిది విజ‌యాల్లో ఫ‌స్ట్ వ‌చ్చిన‌పుడు మ‌నోడి మార్కెట్ 10 కోట్లు.. ఆ త‌ర్వాత 13 కోట్లైంది.. త‌ర్వాత 16.. ఆ త‌ర్వాత 20.. గ‌తేడాది ముందు వ‌ర‌కు 22 కోట్లు.. ఆ త‌ర్వాత 30.. ఇప్పుడు 35 కోట్ల‌కు చేరిపోయింది నాని మార్కెట్. ఈయ‌న కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం బిజినెస్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తున్నాయి. ఈ సినిమాను ఒక‌టి రెండు కాదు.. అక్ష‌రాలా 35 కోట్ల‌కు అమ్మేసాడు దిల్ రాజు. 

నిర్మాత‌లు వేరైనా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది మాత్రం దిల్ రాజే. దాంతో అమ్మ‌కాలన్నీ రాజుగారి చేతుల మీదుగానే జ‌రిగాయి. మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఎప్రిల్ 12న విడుద‌ల కానుంది ఈ చిత్రం. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ ధిల్ల‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నానితో ఇద్ద‌రు జోడీ క‌ట్ట‌డం తొలిసారే. ఇప్ప‌టికే న‌టిగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది అనుప‌మ‌. ఈ మ‌ధ్య రేస్ లో కాస్త వెన‌కబ‌డిన‌ట్లు క‌నిపించిన అనుప‌మ‌.. ఇప్పుడు నాని సినిమాతో ఫామ్ లోకి రావాల‌ని చూస్తుంది. పైగా కృష్ణార్జున యుద్ధం ప్రీ రిలీజ్ బిజినెస్ 47 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ఇందులో థియెట్రిక‌ల్ బిజినెస్ 35 కోట్లు. అంటే సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే క‌చ్చితంగా 35 కోట్లు రావాల‌న్న‌మాట‌. మొత్తానికి ఇప్పుడు నాని దూకుడు చూస్తుంటే ఇంత రావ‌డం క‌ష్ట‌మేం కాదు కానీ సినిమా సినిమాకు కూడా ఇలా రేట్లు పెంచేస్తే బ‌య్య‌ర్ల‌కు క‌ష్ట‌మైపోతుంది క‌దా..!

More Related Stories