English   

నానికి డబుల్ షాక్ ...?

krishnarjuna-yuddham

నేచురల్ స్టార్ గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతోన్న నానికి ఈ సారి డబుల్ షాక్ తగిలిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వెరీ యావరేజ్ సినిమాలను కూడా ‘హిట్ అనిపించుకున్న’నానికి ఈ సారి అది సాధ్యం కాదంటున్నారు. ఇవాళ విడుదలైన కృష్ణార్జున యుద్ధంపై చాలా వరకూ బిలో యావరేజ్ టాక్సే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అస్సలు బాలేదంటున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాని డ్యూయొల్ రోల్ చేశాడు. అతని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాకు డబుల్ రోలే పెద్ద మైనస్ గా మారిందంటున్నారు. నిజానికి ఈ సినిమా ఒక్క పాత్రతో ముగిసిపోయుంటే ఆ ఫీల్ క్యారీ అయ్యేదనే భావన చాలామందిలో ఉంది. పైగా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన తీన్మార్ తో చాలామంది పోలుస్తున్నారు. అటు తీన్మార్ కూడా ఆడలేదు అది కూడా మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. సంగీతానికి సంబంధించి హిప్ హాప్ తమిళ సంగీతం ఒక్కపాటలో మినహా మెప్పించలేకపోయిందంటున్నారు. మొత్తంగా ఇప్పుడు రంగస్థలం పది రోజులు దాటినా ఏ మాత్రం తగ్గడం లేదు. అటు నెక్ట్స్ వీక్ భరత్ అనేనేనుతో మహేష్ బాబు రాబోతున్నాడు. సో.. నానికి ఈ సారి కూడా తన సినిమా హిట్ అనిపించుకునే అవకాశాలు ఆల్మోస్ట్ లేవనే చెప్పాలి. బట్.. అతని నాని ఛరిష్మా వేరే. అది వర్కవుట్ అయితే ఎమ్.సి.ఏ లాగా కమర్షియల్ గా సూపర్ హిట్ అయినా ఆశ్చర్యం లేదు. బట్ ఇలా అన్ని సినిమాలకూ జరుగుతుందనుకోలేం.

More Related Stories