English   

కొంటె కృష్ణుడు.. చిలిపి అర్జునుడు.. 

Krishnarjuna-Yuddham

సినిమాపై ఆస‌క్తి పెర‌గాలంటే ముందు బాగుండాల్సింది టైటిలే. ఇది బాగుంటే ఆటోమేటిక్ గా సినిమాపై కూడా అంచ‌నాలు పెరిగిపోతాయి. ఇప్పుడు నాని చేస్తున్న‌ది కూడా ఇదే. ఈయ‌న సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్స్.. పాట‌లు అన్నీ బాగా హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు టీజ‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది కూడా సూప‌ర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇప్ప‌టికే నాని ఉన్న ఫామ్ చూసి కృష్ణార్జున యుద్ధం కూడా హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచేలా ఉంది. ఊహించినంత లేదు కానీ క‌చ్చితంగా ఈ చిత్రం కూడా కామెడీకి ఢోకా లేద‌ని అర్థ‌మైపోతుంది. ఇందులో కృష్ణ సూప‌ర్ మాస్ అయితే.. అర్జున్ క్లాస్. ఈ సినిమాకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. పైగా అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. వ‌ర‌స‌గా రెండు హిట్లిచ్చిన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఇప్పుడు ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు.

ఇప్ప‌టికే జెంటిల్ మ‌న్ లాంటి క్లాస్ టైటిల్ తో హిట్ కొట్టిన నాని.. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం చేయ‌డానికి వ‌స్తున్నాడు. ఈ సినిమాలో నానితో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్సర్ మీర్ రొమాన్స్ చేస్తున్నారు. క‌థ తిరుప‌తి.. పారిస్ నేప‌థ్యంలో జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డి అక్క‌డి నాని మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే సినిమా. టీజ‌ర్ లో కూడా ఇద్ద‌ర్నీ స‌మానంగా చూపించాడు ద‌ర్శ‌కుడు. నాని డ్యూయ‌ల్ రోల్ ను ప్రేక్ష‌కుల బుర్ర‌ల్లోకి ఎక్కించేసాడు. గ‌తంలో జెంటిల్ మ‌న్, జెండా పై క‌పిరాజు సినిమాల్లో డ్యూయ‌ల్ రోల్ చేసాడు నాని. ఇందులో జెంటిల్ మ‌న్ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు మ‌ళ్లీ గాంధీ సినిమా కోసం డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు నాని. ఎప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ధృవ ఫేమ్ హిప్ హాప్ త‌మిళ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

More Related Stories