English   

కృష్ణార్జునులు రాబోతున్నారు.

krishnarjuna yudham
2018-03-08 18:50:37

నాని.. ఇతనికి ఇంకో పేరుంది.. హిట్ మెషీన్. యస్.. హిట్ తప్ప వేరేదీ తెలియదన్నట్టు దూసుకుపోతోన్న నాని త్వరలో కృష్ణార్జున యుద్ధంతో రాబోతున్నాడు. ఇందులో అతనిది డ్యూయొల్ రోల్. నాని డ్యూయొల్ రోల్ చేయడం ఇది మూడోసారి. ఒక పాత్ర దొంగ అయితే మరోపాత్ర ఫారిన్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు పాత్రల సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి హిట్ మూవీస్ తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ కుర్రాడు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి విడుదల చేసిన రెండు లిరికల్ సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలోని ఫోక్ సాంగ్ ప్రతి ఫోన్ లోనూ కాలర్ ట్యూన్ గా మారింది. ఏప్రిల్ 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రమోషన్స్ లో దూకుడు పెంచుతున్నాడు నాని. ఇందులో భాగంగా ఈ నెల 10న ఉదయం పదిగంటలకు కృష్ణార్జునయుద్ధం టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను డబుల్ చేయబోతున్నారు. ఎలాగూ నాని సినిమాలకు బిజినెస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి.. టీజర్ ను బట్టి హిట్ రేంజ్ ను ఎస్టిమేట్ చేయొచ్చు. ఇప్పటి వరకూ నాని చేస్తోన్న రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఆ పాత్ర పరిచయం ఈ టీజర్ లో కనిపిస్తుందనుకోవచ్చు. మొత్తంగా కథ కొత్తది కాకపోయినా ఈ రెండు పాత్రలతో దర్శకుడు ఓ సర్ ప్రైజింగ్ మ్యాజిక్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఆ మ్యాజిక్ వర్కవుట్ అయితే దర్శకుడికి హ్యాట్రిక్ గ్యారెంటీ.. 

More Related Stories