English   

కృష్ణార్జున యుద్ధం టీజ‌ర్ ఓకే.. మ‌రి ట్రైల‌ర్..?

Krishnarjuna-Yudham
2018-03-13 10:11:50

స‌రిగ్గా మ‌రో నెల రోజుల్లో కృష్ణార్జున యుద్ధం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎప్రిల్ 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది. నాని హీరోగా మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు యూనిట్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. ద్విపాత్రాభిన‌యంతో దుమ్ము దులిపేసాడు నాని. వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాల‌తో జోరు మీదున్న న్యాచుర‌ల్ స్టార్.. కృష్ణార్జున యుద్ధం సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టి చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రంపై ఉన్న అంచ‌నాలే ఈ విష‌యం చెబుతున్నాయి. 

ఇప్పుడు నాని ఉన్న రేంజ్ కు సూప‌ర్ హిట్ టాక్ అవ‌స‌రం లేదు.. జ‌స్ట్ యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా చాలు బండి న‌డుస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల‌తో దూకుడు మీదున్న గాంధీ.. ఇప్పుడు నానితో కృష్ణార్జున యుద్ధం చేయిస్తున్నాడు. ఈ చిత్ర టీజ‌ర్ కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర‌యూనిట్ కూడా ఖుషీ అవుతుంది. ట్రైల‌ర్ మార్చ్ చివ‌ర్లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అన్నీ కుదిర్తే రంగ‌స్థ‌లం ప్ర‌ద‌ర్శిస్తోన్న థియే ట‌ర్స్ లో నాని కృష్ణార్జున యుద్ధం ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ మీర్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ధృవ ఫేమ్ హిప్ హాప్ త‌మిళ‌న్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి చూడాలిక‌.. టీజ‌ర్ తోనే ఇంత ర‌చ్చ చేసిన నాని రేపు ట్రైల‌ర్ తో ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తాడో.. సినిమాతో ఇంకేం చేస్తాడో..? 
 

More Related Stories